రీసెంట్‌గానే థియేటర్లలోకి వచ్చిన 'కాంతార ఛాప్టర్ 1' సినిమా హిట్ అయింది. అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ చిత్రం సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. దానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్. ఎందుకంటే 'కాంతార'లో పంజుర్లీ దేవతకు సంబంధించిన విషయాన్ని చూపించారు. దీన్ని రణ్‌వీర్ కామెడీ చేసేలా ప్రవర్తించడం విపరీతమైన విమర్శలకు దారితీసింది.
ఏం జరిగిందంటే?
కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో పంజుర్లీ దేవతని ఆరాధిస్తుంటారు. 'కాంతార 1' రిలీజ్ టైంలోనే కొందరు సదరు దేవత తరహా వేషాలు వేసుకుని వచ్చారు. దీనిపై హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మూవీని గౌరవంగా చూడాలని, దేవుళ్లను అవమానించేలా ప్రవర్తించకూడదని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడేమో గోవా వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణ్‌వీర్.. పంజుర్లీ దేవతని అవమానించేలా కామెడీ చేశాడు.
(ఇదీ చదవండి: పక్క ఇల్లు కూల్చేయడం కరెక్ట్ కాదు.. పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?)
ఈ కార్యక్రమానికి రిషభ్ శెట్టి హజరవగా.. స్టేజీపై రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. 'రిషబ్.. నేను థియేటర్‌లో కాంతార: చాప్టర్ 1 సినిమా చూశాను. మీ నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆడ దెయ్యం (చాముండీ) మీకు ఆవహించే సీన్‌లో మీ నటన అద్భుతంగా ఉంది' అని ప్రశంసించాడు. అయితే సినిమాలో బాగా పాపులర్ అయిన 'ఓ..' అనే హావభావాన్ని చేసి చూపించాడు. ఇది సీరియస్‌గా ఉండాల్సింది పోయి కామెడీగా అనిపించింది. దీంతో కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యాడు. నిన్నంతా సోషల్ మీడియాలో ఓ రేంజులో రణ్‌వీర్‌ని విమర్శించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు.
'సినిమాలో రిషభ్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలనేది నా ఉద్దేశం. ముఖ్యంగా ఆ సీన్‌లో ఎలా చేశాడనేది చూపించాలనుకున్నాను. మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయాలు, నమ్మకాల్ని ఎప్పుడూ గౌరవిస్తాను. నేను ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే, హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను' అని రణ్‌వీర్ స్టోరీలో రాసుకొచ్చాడు. ఇక్కడ విశేషం ఏంటంటే రణ్‌వీర్.. కర్ణాటకకు అల్లుడే. ఇతడు పెళ్లి చేసుకున్న దీపికది ఆ రాష్ట్రమే. కానీ ఇప్పుడు వాళ్ల నుంచే విమర్శలు ఎదుర్కొన్నాడు.
(ఇదీ చదవండి: నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?)

Ranveer Singh literally mocking Daiva Chavundi possession in Kantara.
How low these movie stars can go for fame, money with zero respect for sacred Tulunad Daivaradhane beliefs🥺
Shame.
Rishabh is enjoying that mimic?@RanveerOfficial @shetty_rishab pic.twitter.com/F4x0X2rVmA— Vije (@vijeshetty) November 29, 2025


