టాలీవుడ్‌లో అప్పట్లో హీరోయిన్‌గా పలు సినిమాలు చేసిన పూనమ్ కౌర్.. ఎప్పటికప్పుడు ఏదోలా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్‌పై గతంలో పలుమార్లు సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతానికి యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ట్వీట్ చేస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే ఓ మహిళ గురించి పరోక్షంగా ప్రస్తవించింది.
(ఇదీ చదవండి: సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం అయిపోయిందా?)
'మన ఇల్లు బాగుండాలని పక్క ఇల్లు కూల్చేయడం సరికాదు. అది కూడా ఓ శక్తిమంతమైన బాగా చదువుకున్న ఎక్కువ ప్రాధాన్యం గల మనిషి ఇలా చేయడం చాలా బాధాకరం. డబ్బు ఏదైనా చేయిస్తుంది' అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. సరిగ్గా ఈమె ట్వీట్ చేసినప్పుడే సమంత మరో పెళ్లి చేసుకుంది. దీంతో పూనమ్.. సమంతని ఉద్దేశిస్తూనే ఈ ట్వీట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సమంతకు ఇది రెండో పెళ్లి. 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుల్లో ఒకడైన రాజ్ నిడిమోరునే వివాహం చేసుకుంది. రాజ్‌కి కూడా ఇది రెండో పెళ్లినే. 2015లో శ్యామోలి అనే మహిళతో ఇతడికి పెళ్లి జరిగింది. ఆమెకు మూడేళ్ల క్రితమే విడాకులు ఇచ్చేశాడని అంటున్నారు గానీ దాని గురించి పెద్దగా క్లారిటీ లేదు. అలాంటిది ఇప్పుడు సామ్-రాజ్.. ఈశా ఫౌండేషన్‌లోని ఓ ఆశ్రమంలో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సమంతనే బయటపెట్టింది. కొన్ని ఫొటోలు కూడా పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?)


