రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కాంతార చాప్టర్-1. ఈ ఏడాది దసరా కానుకగా వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఛావాను అధిగమించింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
తాజాగా ఈ సినిమా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం వారం రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద కనుమరుగవుతున్న సమయంలో ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టేసింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిషబ్ శెట్టి మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో కాంతార ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా.. ఇప్పటికే పలు రికార్డులు తిరగరాసిన కాంతార చాప్టర్-1 మరో క్రేజీ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని కాంతారకు ప్రీక్వెల్‌గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
Celebrating 50 glorious days of #KantaraChapter1.
A divine cinematic experience rooted in our timeless heritage and sacred traditions.#50DaysOfKantaraChapter1 ❤️🔥https://t.co/d7It7XIZUO#BlockbusterKantara #KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere… pic.twitter.com/iEvur0NiQL— Rishab Shetty (@shetty_rishab) November 20, 2025


