చిన్నారికి మెగా దంపతుల ఖరీదైన గిఫ్ట్.. గోల్డ్‌ చైన్‌తో పాటు..! | Megastar Chiranjeevi Presents Costly Gifts To His manager Daughter | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: చిన్నారికి మెగా దంపతుల ఖరీదైన గిఫ్ట్.. గోల్డ్‌ చైన్‌తో పాటు..!

Dec 8 2025 6:26 PM | Updated on Dec 8 2025 6:34 PM

Megastar Chiranjeevi Presents Costly Gifts To His manager Daughter

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం మనశంకర వరప్రసాద్‌ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో వెంకీమామ కూడా నటించారు. ఇటీవలే తన పాత్రకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మెగాస్టార్‌తో కలిసి నటించాలన్న తన కోరిక ఈ మూవీతో నెరవేరిందన్నారు.

అయితే మెగాస్టార్ ఇటీవలే తన మేనేజర్‌ స్వామినాథ్ కుమార్తె నామకరణ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తన సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాపకు అలేఖ్య అని చిరంజీవి పేరు పెట్టారు. మెగాస్టార్‌ తమ కూతురికి పేరు పెట్టడంతో మేనేజర్ దంపతులు ఎమోషనలయ్యారు.

ఈ సందర్భంగా చిరు దంపతులు తమ ప్రేమను చాటుకున్నారు. ఆ చిన్నారికి ఖరీదైన బహుమానం అందించారు. ఆ చిట్టి తల్లికి మెడకు గోల్డ్ చైన్‌ బహుకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాకుండా దాదాపు కోటి రూపాయల విలువైన ల్యాండ్ బహుకరించారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా మెగాస్టార్‌ దంపతులు తమ మేనేజర్ కుటుంబానికి జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్‌ ఇచ్చారని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement