మలయాళ హిట్ సినిమా తెలుగు రీమేక్.. టీజర్ రిలీజ్ | Om Shanti Shanti Shantihi Movie Teaser | Sakshi
Sakshi News home page

తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా 'ఓం శాంతి శాంతి శాంతిః' టీజర్

Dec 8 2025 6:24 PM | Updated on Dec 8 2025 6:29 PM

Om Shanti Shanti Shantihi Movie Teaser

'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. తర్వాత నటుడిగా మారిపోయాడు. సహాయ పాత్రలు చేస్తూ బిజీ అయిపోయాడు. మధ్యలో దర్శకుడిగా 'కీడా కోలా' సినిమా తీసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా మరో మూవీ చేశాడు. అదే 'ఓం శాంతి శాంతి శాంతిః'. ఈ చిత్ర టీజర్ తాజాగా రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్)

మలయాళంలో 2022లో బాసిల్ జోసెఫ్, ధన్య రాజేంద్రన్ హీరోహీరోయిన్లుగా 'జయ జయ జయహే' పేరుతో ఈ సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయింది. దీన్ని తర్వాత ఓటీటీలో రిలీజ్ చేశారు. తెలుగులో డబ్బింగ్ కూడా తీసుకొచ్చారు. ఈ చిత్రాన్నే ఇప్పుడు తరుణ్ భాస్కర్ రీమేక్ చేశాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో మూవీ అంతా ఉండనుంది. ఈ మేరకు టీజర్‌లో విజువల్స్ చూపించారు.

భార్యపై ఆధిపత్యం చెలాయించాలని ఓ భర్త అనుకుంటాడు. కానీ ఊహించని విధంగా భార్య అతడిపై తిరగబడుతుంది. దీంతో విషయం ఎక్కడివరకు వెళ్లింది? చివరకు ఏమైంది అనేదే మూవీ కాన్సెప్ట్. ఇప్పటికే డబ్బింగ్ రూపంలో తెలుగులో ఉన్న ఈ మూవీని ఇప్పుడు రీమేక్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 23న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఇది తెలుగులో ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి?

(ఇదీ చదవండి: దుబాయి యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement