దుబాయి యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి | Actress Sunaina Reveals Relation With Youtuber Khalid Al Ameri | Sakshi
Sakshi News home page

Sunainaa: గతేడాది ఎంగేజ్‌మెంట్.. ఇప్పుడు బంధాన్ని బయటపెట్టారు

Dec 8 2025 3:48 PM | Updated on Dec 8 2025 3:55 PM

Actress Sunaina Reveals Relation With Youtuber Khalid Al Ameri

హీరోయిన్ సమంత.. గతవారం పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వీళ్లిద్దరికీ గతంలోనే వేర్వేరుగా వివాహాలు జరిగాయి కానీ కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కటయ్యారు. ఈ విషయం పక్కనబెడితే మరో తెలుగు హీరోయిన్ కూడా ఇప్పుడు ఆల్రెడీ పెళ్లయిన ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. ఈ మేరకు తమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు!

తెలుగు కుటుంబంలో పుట్టిన సునయన.. 'కుమారి vs కుమారి' అనే సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత సమ్ థింగ్ స్పెషల్, 10th క్లాస్, పగలే వెన్నెల, మిస్సింగ్ తదితర చిత్రాల్లో నటించింది. అయితే టాలీవుడ్‌లో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తమిళంలో ట్రై చేసింది. ఈమెకు హిట్స్ పడ్డాయి. రీసెంట్ టైంలో అయితే శ్రీ విష్ణు 'రాజ రాజ చోర'లో నటించింది. ఈ ఏడాది వచ్చిన 'కుబేర' మూవీలో నాగార్జున పాత్రకు భార్యగా కనిపించింది.

అసలు విషయానికొస్తే.. గతేడాది జూన్‌లో తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని హీరోయిన్ సునయన బయటపెట్టింది. సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. కాకపోతే కాబోయే వ్యక్తి ఎవరనేది రివీల్ చేయలేదు. కొన్నాళ్లకు రూమర్స్ వచ్చాయి. యూఏఈకి చెందిన యూట్యూబర్ ఖలీద్ అల్ అమేరీతో ప్రేమలో ఉందని టాక్ వినిపించింది. కాకపోతే దీన్ని సునయన ఎప్పుడు ధ్రువీకరించలేదు. తాజాగా ఖలీద్.. సునయతో బంధాన్ని పబ్లిక్ చేశాడు.

ఖలీద్ పుట్టినరోజు రెండు రోజుల క్రితం జరగ్గా.. సునయనతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. చేతులు పట్టుకుని తీసుకున్న ఓ సెల్ఫీని కూడా ఖలీద్.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో గతేడాది వచ్చినవి రూమర్స్ కాదు నిజమేనని క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు రిలేషన్ బయటపెట్టారంటే త్వరలో పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెబుతారేమో?

ఖలీద్ విషయానికొస్తే.. యూఏఈకి చెందిన యూట్యూబర్ ఇతడు. సలామా అనే యూట్యూబర్‌ని 2007లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి ఆమెకు విడాకులు ఇచ్చాడో తెలీదు గానీ ఇప్పుడు సునయనతో వివాహానికి సిద్ధమైనట్లు కనిపిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement