కృతీ శెట్టి.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాకే టాలీవుడ్ సెన్సేషన్ అయింది. ఉప్పెన మూవీతో అందరి దృష్టిని ఆకర్షించింది. వరుస అవకాశాలు రావడంతో యంగ్ హీరోలతో జోడీ కట్టింది. అయితే తెలుగులో తన క్రేజ్‌ను, సక్సెస్‌ను అలాగే నిలబెట్టుకోలేకపోయింది. దీంతో కోలీవుడ్‌కు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం అక్కడ మూడు సినిమాలు చేస్తోంది.
ట్రోలింగ్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై జరిగే ట్రోలింగ్ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. కృతీ శెట్టి మాట్లాడుతూ.. నేను చాలా సున్నితమైన వ్యక్తిని.. అమ్మ లేకుంటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్నే కాదు. చిన్న వయసులోనే నేను చాలా విషయాలు ఫేస్ చేశాను.
అమ్మ సపోర్ట్
సోషల్ మీడియాలో నాపై ట్రోలింగ్, ద్వేషం చూసి నాకు చాలా బాధేసింది. ఇక్కడ ఏవీ మన చేతుల్లో ఉండవు. అయినా సరే మనల్నే నిందించినప్పుడు ఇంకా ఎక్కువ బాధేస్తుంది. అప్పుడు అమ్మ అండగా నిలబడి.. నీ వల్ల అయినదానికన్నా ఎక్కువే కష్టపడుతున్నావు అని ధైర్యం చెప్పేది. ఒకానొక సమయంలో నాపై నేను నమ్మకం కోల్పోయాను.
తట్టుకలోకపోయా..
నిజ జీవితంలో నన్నెవరైనా కామెంట్ చేసుంటే పట్టించుకునేదాన్ని కాదు. కానీ కెరీర్‌లో ఇలాంటి కామెంట్స్ వినేసరికి తట్టుకోలేకపోయాను. అప్పుడు ఫ్రెండ్స్ నేను బాధపడనీయకుండా నాతోనే ఉన్నారు. నేను హ్యాపీగా ఉండేలా చూసుకున్నారు అంటూ కృతీ శెట్టి (Krithi Shetty) కన్నీళ్లు పెట్టుకుంది.


