సినిమాల్లో కేవలం స్టార్‌డమ్ ఉంటే చాలదు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కూడా ఉండాలి. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినంత మాత్రాన ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు కొంతవరకు బెనిఫిట్ ఉన్నప్పటికీ.. అది పూర్తిస్థాయిలో రావాలంటే సొంతం పనిమీదే ఆధారపడి ఉంటుంది.
అలా టాలీవుడ్ అగ్రకుటుంబం నుంచి వచ్చిన అఖిల్ అక్కినేనికి సరైన హిట్ పడడం లేదు. రెండేళ్ల క్రితం వచ్చిన ఏజెంట్ మూవీ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు అఖిల్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ లవ్‌స్టోరీ చిత్రం లెనిన్ . ఈ మూవీకి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగానే అఖిల్‌కు సంబంధించి మరో టాక్ వినిపిస్తోంది. లెనిన్‌తో బిజీగా ఉన్న అఖిల్ మరో క్రేజీ ప్లాన్ చేస్తున్నారని చర్చ మొదలైంది. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో ప్రశాంత్ నీల్‌తో అఖిల్ మీట్ అయినట్లు లేటేస్ట్ టాక్ నడుస్తోంది. ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌తో అఖిల్ ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇంట్లో సమావేశమైనట్లు సమాచారం.
అయితే ప్రశాంత్ నీల్ వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్‌తోనే ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారని టాక్. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌ను ప్రశాంత్ నీల్ పర్యవేక్షణలోనే చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లెనిన్ ఈ మూవీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే అఖిల్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ ఇదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


