సినిమా లేదా సిరీస్ బాగుందంటే జనం ఆటోమేటిక్‌గా చూస్తారు. సెలబ్రిటీలు కూడా ఆయా ప్రాజెక్ట్‌ను మెచ్చుకుంటూ పోస్టులు పెడతారు. అయితే బాలీవుడ్‌లో ఇలా మెచ్చుకునే ప్రోగ్రామ్స్ ఉండవంటున్నాడు నటుడు మనోజ్ బాజ్‌పాయ్. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'. ఈ సిరీస్ మూడో సీజన్ ఇటీవలే రిలీజవగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
జీవితంలో మర్చిపోలేను
తాజాగా ఫ్యామిలీ మ్యాన్ టీమ్ అంతా ఓ చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా జైదీప్ అహ్లావత్ మాట్లాడుతూ.. పాతాళ్ లోక్ సీజన్ 1 రిలీజైనప్పుడు మనోజ్ రాత్రిపూట నాకు ఫోన్ చేసి పావుగంటపైనే మాట్లాడాడు. అది నేను నా జీవితంలో మర్చిపోలేను. ఆ ఫోన్‌కాల్ తర్వాత నేనెంతో ఏడ్చాను అని చెప్పాడు. ఇంతలో మనోజ్ మాట్లాడుతూ.. ఆ రోజు ఫోన్‌లో ఏం చెప్పానంటే అతడు ఒక ఇన్‌స్టిట్యూషన్ ఓపెన్ చేస్తే అందులో తాను ఒక విద్యార్థిగా చేరతానన్నాను అని గుర్తు చేసుకున్నాడు.
అభద్రతా భావం ఎక్కువ
ఆ వెంటనే ఇండస్ట్రీలో ఇలా ఒకరినొకరు పొగడటం చాలా తక్కువ అని చెప్పాడు. ఏ సెలబ్రిటీ కూడా ఫోన్ చేసి నీ యాక్టింగ్ బాగుంది, నీ ప్రాజెక్ట్ బాగుంది అని చెప్పరు. ఎందుకంటే వాళ్లకు అభద్రతా భావం ఎక్కువ. ఇప్పటికీ నేను మంచి పాత్రల కోసం ఫోన్ చేసి అడుగుతుంటాను. కష్టజీవిగా ఉండటానికే నేను ఇష్టపడతాను అని మనోజ్(Manoj Bajpayee) చెప్పుకొచ్చాడు. కాగా మనోజ్ బాజ్‌పాయ్, జైదీప్ అహ్లావత్ (Jaideep Ahlawat).. గతంలో గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్ అనే వెబ్ సిరీస్‌లో, చిట్టగ్యాంగ్ మూవీలో నటించారు.


