breaking news
Jaideep Ahlawat
-
రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్, లగ్జరీ కారు.. ఎవరీ నటుడు?
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ - జైదీప్ అహ్లవత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'జ్యువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్' (Jewel Thief: The Heist Begins) శుక్రవారం ఓటీటీలో విడుదలైంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ సమర్పణలో, రాబీ గ్రెవాల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జైదీప్ అహ్లవత్ లైఫ్ స్టైల్, ఆస్తులపై నెట్టింట చర్చ ఆసక్తికరంగా మారింది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడిగా ఉన్న జైదీప్ నికర విలువ ఎంత? ఇతర విలువైన ప్రాపర్టీస్ ఏంటి తెలుసుకుందామా..!తనదైన నటనతోపాటు, ఇటీవల కాలంలో బాగా బరువు తగ్గి సత్తా చాటుకుంటున్నాడు జైదీప్ అహ్లవత్ (Jaideep Ahlawat). వరుస అవకాశాలతో ఇర్ఫాన్ ఖాన్, మనోజ్ బాజ్‌పేయి, అశుతోష్ రాణా, రాజ్‌కుమార్ రావు, విజయ్ రాజ్, కేకే మీనన్ వంటి సినిమా దిగ్గజాల సరసన చోటు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 'జువెల్ థీఫ్'లో 'జాదు' పాటలో స్టెప్పులతో సంచలనం సృష్టించాడు. ఇప్పటికే పాతాళ్ లోక్ సీజన్ 2తో స్ట్రీమింగ్ రికార్డులను బద్దలు కొట్టాడు. దీంతో అతని నికర విలువ ఒక్కసారిగా పుంజుకుంది.2010లో ప్రియదర్శన్ చిత్రం 'ఖట్టా మీఠా'లో అరంగేట్రం చేశాడు జైదీప్ అహ్లవత్. ప్రస్తుతం అతడు ఎంజాయ్ చేస్తున్న సక్సెస్ అంత ఈజీగా రాలేదు. హర్యానాలోని ఖార్ఖరాలో పెరిగిన జైదీప్ భారత సైన్యంలో చేరాలని కలలు కన్నాడు. కానీ ఆ కల నెరవేరకపోవడంతో నాటకాలవైపు మళ్లాడు. ఇంగ్లీష్ సాహిత్యంలో ఎంఏ పూర్తి చేసి, FTIIలో చదివిన తర్వాత, సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఖార్ఖరా నుండి పూణే, ముంబైకి మధ్య తిరుగుతూ నటుడు కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, పాతాళ్ లోక్ లో అద్భుతమైన నటన అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది.14 ఏళ్లకు పైగా కష్టపడి తాను అనుకున్నది సాధించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ తన రెమ్యూనరేషన్‌ను రూ. 40 లక్షల నుంచి రూ. 20 కోట్లకు పెంచుకోవడం అంటే మాటలు కాదు. తాజా నివేదికల ప్రకారం 'పాతాళ్ లోక్' మొదటి సీజన్ కోసం జైదీప్ రూ.40 లక్షలు వసూలు చేశాడు. పాతాళ్ లోక్ సీజన్ 2 సైన్ చేయడానికి ముందు జైదీప్ ఆస్తి రూ. 8 కోట్లు. ఈ సిరీస్‌లో 'హాథీ రామ్ చౌదరి' పాత్రను పోషించినందుకు రూ.20 కోట్లు తీసుకున్నాడట. అయితే అలాంటి వాదనలను ఖండించినప్పటికీ, జైదీప్ రెమ్యూనరేషన్ రూ. 40 లక్షల నుంచి రూ. 20 కోట్లకు చేరిందంటూ ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి.చదవండి: సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!జైదీప్ జైదీప్ బహుళ ఆస్తులను కలిగి ఉన్నాడని కూడా మీడియా కోడై కూస్తోంది. కొన్ని లగ్జరీ కార్లతో పాటు, రూ. 1.32 కోట్ల విలువైన లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ GLS SUV కూడా జైదీప్ సొంతం. ప్రొఫెషనల్ డ్యాన్సర్ జ్యోతి హుడాను 2009లో అతడు వివాహం చేసుకున్నాడు.చదవండి: ఫ్యామిలీ మ్యాన్ 3 విలన్ జైదీప్ అహ్లవత్ : 110 నుంచి 83 కిలోలకు ఎలా? -
ఫ్యామిలీ మ్యాన్ 3 విలన్ జైదీప్ అహ్లవత్ : 110 నుంచి 83 కిలోలకు ఎలా?
ది ఫ్యామిలీ మ్యాన్-3లో విలనిజం పండిచబోతున్న నటుడు జైదీప్ అహ్లవత్ ఇపుడు ట్రెండింగ్‌లో ఉన్నాడు. మరీ ముఖ్యంగా భారీ బరువు నుంచి బరువును తగ్గించుకుని కండలు తిరిగిన దేహంతో స్మార్టగా తయారైనాడు. ఐదు నెలల్లో 27 కిలోలు తగ్గాడు. దీని కోసం భారీ కసరత్తులే చేశాడు.ఫలితంగా 109.7 కిలోల నుండి 83 కిలోలకు చేరుకున్నాడు. ఈజీ చిట్కాలు, ట్రెండీ డైట్ లాంటివి కాకుండా 27 కిలోల బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నాడు? అహ్లవత్ వెయిట్‌లాస్ జర్నీని క్రమంలో తెలుసుకుందామా?బాలీవుడ్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన నటుడు జైదీప్ అహ్లవత్. ముఖ్యంగా పాతాళ్ లోక్‌లో హతీ రామ్ చౌదరి పాత్ర ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. అలాగే విలన్‌గా గాకుండా రొమాంటిక్ మూవీలు చేయాలని ఉందనే కోరికనుకూడా వ్యక్తం చేశాడు. సినిమాల్లో మరింత రాణించాలనే పట్టుదలతో తనబాడీని అద్భుతంగా తీర్చుదిద్దుకున్నాడు. ఈ వెయిట్ టాస్ జర్నీ అచంచలమైన క్రమశిక్షణ, ఫిట్నెస్ పట్ల అంకితభావం , కఠినమైన ఆహార నియమావళికి నిదర్శనంగా నిలుస్తోంది.ఇందుకోసం అహ్లవత్ తీవ్రమైన వ్యాయామాల ద్వారా తన బాడీని మల్చుకున్నాడు. చీట్ మీల్స్ , చిన్ని చిన్ని వ్యాయామలు లాంటి సాకులు లేకుండా పూర్తి నిబద్ధతతో తనలక్ష్యంవైపు గురిపెట్టాడు. ఇది తీవ్రమైన బరువు తగ్గడానికి కేలరీలను తగ్గించుకోవడం చాలా అవసరం. లాక్డౌన్ తర్వాత నే దాదాపు ఒక సంవత్సరం పాటు వ్యాయామం చేయకపోవడంతో చాలా బరువు పెరిపోయానని, మళ్లీ టోన్డ్ బాడీకోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని ఒకసందర్బంలో తెలిపాడు . తన ట్రైనర్ ప్రజ్వల్ దర్శకుడు సిద్ధార్థ్ పి మల్హోత్రా ప్రోత్సాహంతో బరువు తగ్గినట్టు చెప్పాడు. ఈ విశేషాలు ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్‌తో షేర్ చేశాడు. 2024లో సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వంలో వచ్చిన మూవీ మహారాజ్ పాత్రకోసం ఈ జర్నీని షురూ చేశాడు.అహ్లవత్ పాటించిన నియమాలు, స్పష్టమైన లక్ష్యాలుబరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, స్పష్టమైన,సాధించగల లక్ష్యాలపై స్పష్టత ఉండాలి. సులువుగా, త్వరగా బరువు తగ్గడం ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కాని వారానికి 0.5 నుండి 1 కిలోలు తగ్గాలనేది గోల్ పెట్టుకోవడం ఉత్తమం. ఇది ఎక్కువ కాలం ఈ జర్నీని కొనసాగించేలా ప్రేరేపిస్తుంది.కేలరీల లెక్కింపు కంటే పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వండిసరైన పోషకాహారం లేకుండా కేలరీలను తీవ్రంగా తగ్గించడం వల్ల కండరాల నష్టం, పోషక లోపాలు, జీవక్రియ మందగమనం లాంటివి రావచ్చు.కేలరీలను లెక్కించడానికి బదులుగా, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ , సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తినాలి.చాలామంది బరువు తగ్గడానికి కార్డియోపై మాత్రమేదృష్టి పెడతారు. బరువులు ఎత్తడం కండరాలు, ఎముకలు బలోపేతానికిసహాయపడుతుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. కోల్పోయిన బరువులో ఎక్కువ భాగం కండరాలు నష్టపోకుండా కొవ్వు కరిగేలా చేస్తుంది. ఫ్యాడ్ డైట్లు త్వరగా బరువు తగ్గడానికి దారితీయవచ్చు కానీ , పాటించడం కష్టం, ఆరోగ్య సమస్యలొస్తాయి. దీనికి బదులుగా, స్థిరమైన, సమతుల్యమైన ఆహార ప్రణాళికను స్వీకరించాలి. క్రమంగా జీవనశైలి మార్పులు దీర్ఘకాలిక విజయానికి దారితీస్తాయి.హైడ్రేటెడ్‌గా ఉంటూ, ఎలక్ట్రోలైట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరానికి తగినన్నినీళ్లు అందించడం వల్ల జీర్ణక్రియకు సహాయ పడుతుంది, ఆకలి అదుపులో ఉంటుంది, మొత్తం జీవక్రియకు సాయపడుతుంది. ఇది బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కువగా బరువుగా తగ్గినపుడు శరీరం ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది, ఇది అలసట, కండరాల తిమ్మిరి, తలనొప్పికి దారితీస్తుంది. కనుక శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి.నిద్ర లేమి, అధిక ఒత్తిడి అనారోగ్యకరమైన ఆహారాలపై కోరికలను పెంచుతాయి. ఆకలి, జీవక్రియను నియంత్రించే హార్మోన్లను అంతరాయం కలిగించడం ద్వారా బరువు తగ్గించే ప్రయత్నాలను దెబ్బతీస్తాయి. సో..కనీసం 7–9 గంటల నాణ్యమైన నిద్ర ఉండాలి.ఎప్పటికపుడు ఎంత బరువు తగ్గుతున్నాం, బాడీ కొలతలు, ఫోటోలు, బట్టలు ఇలాంటి పారామీటర్లను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి విజయానికి ముఖ్యమైన గుర్తులు. ఒక వేళ అనుకున్నఫలితం రాకపోయినా నిరాశ పడకుండా వ్యాయామ తీవ్రతను సర్దుబాటు చేయడం, ప్రోటీన్ ఇన్‌టేక్ పెంచడం, లేదా ఇంటర్మిటెంట్ ఉపవాసంపై శ్రద్ధపెట్టాలి. ఇలా కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, గణనీయమైన బరువును తగ్గించుకోవడంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.