కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కూలీ మూవీతో సూపర్ హిట్ కొట్టారు. ఈ చిత్రంలో రజినీకాంత్ హీరోగా నటించగా.. బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆ తర్వాత అమిర్ ఖాన్‌తో మూవీ తెరకెక్కించేందుకు లోకేశ్ రెడీ అయ్యారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అటు కోలీవుడ్.. ఇటు బాలీవుడ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అయితే ఇటీవల ఈ సినిమా రద్దైనట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే స్టోరీని మరో నటుడితో లోకేశ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ స్పందించారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిర్ ఈ విషయంపై మాట్లాడారు. కాగా.. అమిర్‌తో సినిమా పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తానని లోకేశ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు లోకేశ్ కనగరాజ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హీరోగా డీసీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో వామిక గబ్బి హీరోయిన్‌గా కనిపించనుంది. అంతేకాకుండా రజనీకాంత్- కమల్‌హాసన్‌లతో లోకేశ్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో పాటు ఖైదీ -2 మూవీని ఎప్పుడో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే లోకేశ్ బిజీగా ఉండడం వల్లే అమిర్ ఖాన్‌తో చిత్రంపై రూమర్స్ వచ్చినట్లు తెలుస్తోంది.


