చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో సినిమాల సందడి మొదలవుతుంది.ఈ వారంలో టాలీవుడ్ నుంచి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా నటించిన ఓం శాంతి శాంతి శాంతిః మూవీ సందడి చేయనుంది. ఈ మూవీపై మాత్రమే ఆడియన్స్‌లో బజ్ ఏర్పడింది. దీంతో పాటు ఒకట్రెండ్ డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజయ్యే ఛాన్స్ ఉంది.
ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్ ఓటీటీకి రానుంది. దీంతో పాటు సర్వం మాయ లాంటి డబ్బింగ్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 12 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
ధురంధర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30
మిరాకిల్: ద బాయ్స్ ఆఫ్ 80స్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 30
97 మినిట్స్(హాలీవుడ్)- జనవరి 30
అమెజాన్ ప్రైమ్
దల్ దల్ (హిందీ సిరీస్) - జనవరి 30
క్రిస్టీ(హాలీవుడ్ మూవీ)-జనవరి 30
ది లాంగ్ వాక్(హాలీవుడ్ మూవీ)- జనవరి 30
జియో హాట్‌స్టార్
సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30
సన్ నెక్స్ట్
పతంగ్ (తెలుగు సినిమా) - జనవరి 30
ఆపిల్ టీవీ ప్లస్
యో గబ్బా గబ్బా ల్యాండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 30
జీ5
దేవ్‌కెళ్ (మరాఠీ సిరీస్) - జనవరి 30
మనోరమ మ్యాక్స్..
గులాబ్ జామూన్(మలయాళ సినిమా)- జనవరి 30
హులు..
ఎల్లామెక్‌కే(హాలీవుడ్ సినిమా)- జనవరి 30


