వరుస పాన్ ఇండియన్ సినిమాలతో దూసుకెళుతున్న ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజీ’. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
‘‘పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూస్ షెడ్యూల్స్ ప్లాన్ చేశాం. ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్‌ఫుల్ పాత్రలో చూపించబోతున్నారు హను రాఘవపూడి. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.
వరల్డ్ క్లాస్ ప్రోడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా విజువల్ వండర్‌లా ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండగ సందర్భంగా ‘ఫౌజీ’ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: సుదీప్ ఛటర్జీ.


