బిగ్‌బాస్ అమర్‌దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్‌ఎమ్ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ నుంచి 'నా కుట్టీ కుట్టీ సుమతీ.. నా చిట్టీ చిట్టీ సుమతీ' అంటూ సాగే లవ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అమర్‌దీప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చానని అన్నారు. అనంతపురం నుంచి వచ్చిన వ్యక్తిని.. రామ అనే పేరుతో మీ అందరికీ పరిచయమే.. అందుకే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చారు. ఆల్రెడీ హీరోలున్నారు కదా.. నువ్వెందుకురా అని మీరందరూ అనుకోవచ్చు.. కానీ దీనికి నా దగ్గర సమాధానం ఉందన్నారు. ఇది రేపొద్దున కాదు అంటే.. అప్పుడు నన్ను మీరు ట్రోల్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అన్నారు. కానీ మీకు ఆ అవకాశం ఇవ్వకుండా చేశానని తెలిపారు.
ఈ మూవీ కోసం ప్రాణం పెట్టి చేశానని అమర్‌దీప్ చౌదరి పేర్కొన్నారు. కాగా.. ఈ సినిమా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు.
"హీరోలున్నారు కదా.. నువ్వెందుకురా అనుకోవచ్చు"
'నేను ఎందుకురా' అనేదానికి ఇందులో ఫుల్ సమాధానం ఉంది!!
"రేప్పొద్దున కాదు ఇది లేదు అంటే అప్పుడు మాట్లాడండి బ్రదర్స్.. అప్పుడు ట్రోల్ చేయండి సిస్టర్స్"
- #Amardeep గారు #SumathiSathakam pic.twitter.com/hxka7yk0CH— Mega Abhimani (@megaabhimani3) January 29, 2026


