దీపావళి సినిమాలు.. జోరు మీదున్న హీరో.. వెనకబడ్డ సిద్ధు! | K Ramp, Dude, Telusu Kada Movie Collections | Sakshi
Sakshi News home page

దీపావళి సినిమాల పరిస్థితి.. ఏ సినిమా కలెక్షన్స్‌ ఎంతంటే?

Oct 19 2025 1:58 PM | Updated on Oct 19 2025 2:56 PM

K Ramp, Dude, Telusu Kada Movie Collections

ఈసారి దీపావళి పండగ అక్టోబర్‌ 20వ తారీఖున వస్తోంది. కానీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం అప్పుడే పండగ మొదలైంది. తెలుగులో పోటాపోటీగా సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఒకటి ఉల్లిగడ్డ బాంబ్‌లా సౌండ్‌ చేస్తుంటే మరోటి చిచ్చుబుడ్డిలా వెలుగుతోంది. ఒకటైతే మందుగుండు లేని పటాకాలా మిగిలిపోయింది. అవేంటి? వాటి కలెక్షన్స్‌ ఏంటో చూద్దాం..

రేసులో లేని మిత్రమండలి
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిత్రమండలి. అక్టోబర్‌ 16న రిలీజైన ఈ మూవీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్న చందంగా మారింది పరిస్థితి! మొదటిరోజే ఈ పటాకా ఎవరికీ నచ్చలేదు. ఇప్పుడిక వేరే సినిమాల ఆప్షన్స్‌ ఉండటంతో రేసులో చివరి స్థానానికి వెళ్లిపోయింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన మూవీ తెలుసు కదా. ఈ మూవీ అక్టోబర్‌ 17న విడుదలైంది. కథ బాగున్నా కాస్త ల్యాగ్‌ అవడంతో మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంటోంది.

స్పీడు మీదున్న డ్యూడ్‌
తొలి రోజు ఈ సినిమా రూ.3 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది జాక్‌ కంటే కూడా తక్కువ! అయితే మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లు కాస్త మెరుగయ్యాయని చెప్తున్నారు. ఇక అక్టోబర్‌ 17న తమిళ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ నటించిన డ్యూడ్‌ (Dude Movie) కూడా రిలీజైంది. ఈ మూవీ సెకండాఫ్‌పై కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తున్నారు. ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లు రాబట్టిందని అధికారిక ప్రకటన విడుదల చేశారు.

కె-‍ర్యాంప్‌ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌
అన్నిటికంటే ఆలస్యంగా (అక్టోబర్‌ 18న) వచ్చిన మూవీ కె-ర్యాంప్‌ (K-Ramp Movie). ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్టు దిగిందా? లేదా? అంటూ బరిలోకి దిగిన కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) సినిమాకు హిట్‌ టాక్‌ వస్తోంది. తొలిరోజు ఈ చిత్రానికి రూ.4.5 కోట్ల కలెక్షన్స్‌ వచ్చాయని చిత్రయూనిట్‌ ప్రకటించింది. మరి ఏ సినిమా వసూళ్లు పెరగబోతున్నాయి? దీపావళి హిట్‌ బొమ్మ ఏదనేది చూడాలి!

 

 

చదవండి: కోటిలో బ్యాగులు అమ్ముకున్నా.. బాత్రూమ్‌లు కడిగా: ‘జబర్దస్త్‌’ కమెడియన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement