కోటిలో బ్యాగులు అమ్ముకున్నా.. బాత్రూమ్‌లు కడిగా: ‘జబర్దస్త్‌’ కమెడియన్‌ | Interesting Facts About Jabardasth Comedian Komarakka | Sakshi
Sakshi News home page

కోటిలో బ్యాగులు అమ్ముకున్నా.. బాత్రూంలు కడిగా: ‘జబర్దస్త్‌’ కొమురక్క

Oct 19 2025 12:55 PM | Updated on Oct 19 2025 1:11 PM

Interesting Facts About Jabardasth Comedian Komarakka

పనే నాకు దేవుడు. మనం చేసే పనే డబ్బుతో పాటు గుర్తింపు, గౌరవం తెచ్చిపెడుతుంది. నిజాయితీగా పని చేసేవాడికే దేవుడు సక్సెస్ఇస్తాడని నేను నమ్ముతానుఅంటున్నాడు నటుడు కుమార్‌ అలియాస్‌ ‘జబర్దస్త్‌‌’ కొమురక్క. లేడీ గెటప్తో అందరిని అలరిస్తున్న కొమురం.. ఇప్పుడు స్థాయిలో ఉండడానికి చాలానే కష్టపడ్డాడు. ఒకప్పుడు హోటల్లో పని చేయడమే కాదు.. బాత్రూంలు కడిగాడట. వచ్చిన ప్రతీ రూపాయిని భూమిపై ఇన్వెస్ట్చేయడంతో ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అంటున్నాడు కమెడియన్‌. తాజాగా యూట్యూబ్చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ప్రారంభంలో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.

కోటిలో బ్యాగులు అమ్ముకున్నా..
పదో తరగతి అయిపోగానే నేను హైదరాబాద్కి వచ్చాను. డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. హోటల్లో పని చేశాను. కిరాణం దుకాణం పెట్టి స్టాఫ్కి ఉద్దెర ఇచ్చేవాడిని. హోటల్లో పని అయిపోగానే కోటిలో ఎఫ్ఎమ్రేడీయోలు, బ్యాగులు అమ్ముకునేవాడిని. వర్షాకాలం వస్తే గొడుగులు, పర్సులు అమ్ముకునేవాడిని. అలా ఎమిమిదేళ్ల పాటు కష్టపడి పని చేశాను. ఒకవైపు హోటల్లో పని.. కిరాణ దుకాణం.. గ్యాప్లో కోటిలో బ్యాగులు అమ్ముకోవడం..ఇలా రెస్ట్లేకుండా పని చేసేవాడిని. ఫ్యామిలీని వదిలి హైదరాబాద్కు వచ్చిందే డబ్బుల కోసం. అందుకే నేను ఖాళీగా ఉండేవాడిని కాదు.

రూ.4500 జీతం.. బాత్రూంలు కడిగా..
హైదరాబాద్లో ఎనిమిదేళ్లు పని చేసిన తర్వాత తిరిగి సొంతూరు(షాద్‌నగర్‌)కు వచ్చేశా. పెళ్లి తర్వాత కంపెనీలో హమాలీ పనికి చేరాను. అప్పుడు నా జీతం రూ. 4500 మాత్రమే. హమాలీ పనితో పాటు అక్కడ బాత్రూంలు కూడా కడిగేవాడిని. అందరూ నన్ను హేళన చేసిన పట్టించుకునేవాడిని కాదు. పని చేసినా నిజాయితీగా చేయడమే నా లక్ష్యం. బాబు పుట్టిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు హమాలీ పని చేశాడు

సినిమాల కోసం ప్రయత్నాలు
రోజు నా భార్యఎన్నాళ్లు ఇలా దమ్ములో పని చేస్తావ్‌?, నీకు సినిమాలు అంటే ఇష్టం కదా.. ప్రయత్నాలు చెయ్‌. బాబుని నేను చూసుకుంటాఅని చెప్పింది.మూడేళ్ల పాటు సినిమా ప్రయత్నాలు చెయ్‌..అప్పటికీ సక్సెస్కాకపోతే తిరిగి వచ్చేసి ఏదైనా పని చేసుకుందాంఅని ఆమె చెప్పింది. నేను ఐదేళ్ల పాటు చాన్స్ కోసం తిరిగాను. సమయంలో నా భార్యే నాకు నెలకు రూ. 3000 పంపించేది. కుట్టు మిషన్కుడుతూ పిల్లాడిని పెంచింది. బంధువులంతా నానా మాటలు అనేవాళ్లు. సినిమా ఇండస్ట్రీపై చెడుగా చెప్పేవారు. నా భార్య మాత్రం అవేవి పట్టించుకునేది కాదు.

కొమురక్క పాత్ర అలా పుట్టింది
ఓసారి న్యూస్చానల్కి నేనే కొత్త ప్రోగ్రాం ఐడియా ఇచ్చాను. లేడీ ఉంటుందని, ఇలా మాట్లాడుతుందని చెప్పి గెటప్ని నాకు నేనే క్రియేట్చేసుకున్నా. పాత్రకు ముందుగా పోచమ్మ అని పేరు పెట్టుకున్నాను. కానీ అప్పటి ఆంథోల్ఎమ్మెల్యేగా ఉన్న క్రాంతి కుమార్‌ ‘కొమురమ్మఅని పెట్టు అని సలహా ఇచ్చాడు. ఆయన తల్లిగారి పేరు అది. నేను గెటప్వేస్తే తన తల్లిలాగే అనిపించిందని.. పేరు పెట్టుకోమని చెప్పాడు. నేను అమ్మ అని పెడితే ఏది పడితే అది మాట్లాడలేమని చెప్పికొమురక్కఅని పెట్టుకున్నాను. అప్పటి నుంచి అది ఫేమస్అయిపోయింది. జబర్దస్త్లోపశువులు అంటే ప్రాణంఅంటూ నేను చేసిన కామెడీ ఎపిసోడ్బాగా వైరల్కావడంతోకొమురక్కపేరు అందరికి తెలిసింది.

ప్రతిపైసా భూమిపై పెట్టా..
ఒకప్పుడు మాకు షాద్నగర్లో 20 ఎకరాల వరకు భూమి ఉండేది. మా నాన్న అమ్ముకుంటూ వచ్చి చివరకు 5 ఎకరాలకు తీసుకొచ్చాడు. అప్పటి నుంచే నాకు భూమి కొనాలనే ఆశ ఉండేది. నేను, నా భార్య సంపాదించిన ప్రతి పైసా భూమిపై పెట్టా. నాకు చెడు అలవాట్లు లేవు. అప్పట్లో చాలా తక్కువ ధరకు భూమిని కొన్నాను. ఇప్పుడు దాని విలువ పెరిగింది. నా చుట్టుపక్కల వారికి కూడా అదే చెప్తాను. డబ్బులు వృథా చేయకుండా.. ఇలా ల్యాండ్పై ఇన్వెస్ట్చేస్తే భవిష్యత్బాగుంటుందని చెప్తానుఅని కొమురం చెప్పుకొచ్చాడు. ‘మీ ఆస్తి మొత్తం విలువ దాదాపు రూ. 200 కోట్ల వరకు ఉంటుందా?’ అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు..నవ్వుతూ ‘అంత ఉందని చెప్పలేను కానీ.. అదృష్టం కొద్ది అప్పట్లో తక్కువ ధరకు ల్యాండ్‌ కొంటే.. ఇప్పుడు దాని విలువ పెరిగింది’ అని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement