
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'బైసన్ కాలమడాన్'. హిట్ చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అప్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్, నీలం స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధైర్యం, సాహసం కలిగిన ఒక యువ క్రీడాకారుడి అందమైన కథాచిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు ధృవ్ విక్రమ్ వైవిధ్య భరిత కథా పాత్రలో నటించారు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే ఫుట్‌బాల్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో దర్శకుడు అమీర్, లాల్, పశుపతి నటి రజీషా విజయన్ ముఖ్యపాత్రలు పోషించారు.
In a Land of Chaos, rises a Believer! #BisonKaalamaadan 🦬 காளமாடன் வருகை
Trailer Out Now ▶️ https://t.co/mwDlHRrJqx
4 Days to go until his last Raid 🔥#BisonKaalamaadanFromDiwali #BisonKaalamaadanOnOct17 🎆@applausesocial @NeelamStudios_ #SameerNair @deepaksegal… pic.twitter.com/kDLfnFWBcQ— Anupama Parameswaran (@anupamahere) October 13, 2025