
టాప్ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు సారథ్యం వహిస్తున్న తెలుగు తేజం సత్య నాదెళ్ల (Satya Nadella ) తన ఘనతను చాటుకున్నారు. ఏఐ (Artificial Intelligence-AI)) నిపరుగులుపెట్టించిన మైక్రోసాఫ్ట్ సీఈవో (Microsoft CEO)గా ఆయన జీతం భారీగా పెరిగింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సత్యనాదెళ్ల జీతం 22 శాతం ఎ గిసి 96.5 మిలియన్ల డాలర్లకు చేరుకుంది. భారత కరెన్సీ ప్రకారం.. రూ.847.31 కోట్లు. దశాబ్దం క్రితం ఈ పదవిని చేపట్టినప్పటి నుండి సత్యా నాదెళ్ల అందుకుంటున్నఅత్యధిక జీతం. ఏఐ)లో కంపెనీ సాధించిన పురోగతి ఈ పెరుగుదలకు కారణమని బోర్డు చెప్పిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సత్తా చాటడంతో ఆయన వేతనం భారీగా పెరిగిందని "ఈ తరాల సాంకేతిక మార్పుకు సత్య నాదెళ్ల చ అతని నాయకత్వ బృందం మైక్రోసాఫ్ట్‌ను స్పష్టమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీడర్‌గా నిలబెట్టిందని బోర్డు పరిహార కమిటీ మంగళవారం విడుదల చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ,వాటాదారులకు రాసిన నోట్‌లో పేర్కొంది. దీని ప్రకారం సత్య నాదెళ్ల బేసిక్ సాలరీ 2.5 మిలియన్ డాలర్లు. మిగిలిన కంపెనీ షేర్ల రూపంలో అందుకోనున్నారు. నాదెళ్ల జీతంలో దాదాపు 90 శాతం మైక్రోసాఫ్ట్ షేర్ల రూపంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన 79.1 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్న సంగతి తెలిసిందే. (ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న దీపికా తనయ ‘దువా’ ఫోటోలు : అలియా రియాక్షన్)
సత్యనాదెళ్ల ప్రస్థానం
1967 ఆగస్టు 19న హైదరాబాద్‌లో జన్మించారు సత్య నాదెళ్ల. తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. తల్లి ప్రభావతి లెక్చరర్. హైదరాబాద్‌లో పాఠశాల విద్య అనంతరం, కర్ణాటకలోని మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ పట్టా పొందారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ నుంచి 1990లో ఎంఎస్ పూర్తి చేశారు.1992లో మైక్రోసాప్ట్‌లో ఉద్యోగంలో చేరిన అంచెలంచెలుగా ఎదిగి వివిధ హోదాల్లో సత్తాచాటుకున్నారు. 2014లో నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఏఐ రేపుతున్న సంచలనం ఆయనకు వరంగా మారింది.
ఇదీ చదవండి: 35 మంది, 3,670 గంటలు : పింక్ బాల్ ఈవెంట్‌లో మెరిసిన ఇషా అంబానీ