
బాలీవుడ్ జంట్ దీపికా పదుకొనే (Deepika Padukone), రణ్‌వీర్(Ranveer Singh) దివాలీ సందర్భంగా తమ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లు తమ ముద్దుల తనయ ముఖాన్ని సోషల్ మీడియా కంటపడకుండా జాగ్రత్త పడిన దీపికా, రణ్‌వీర్ దంపతులు ఎట్టకేలకుల తమ గారాలపట్టి దువాను ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. ముద్దుగా రెండు పిలకలు, నోట్లో వేలు, అమ్మ ఒడిలో కూర్చొని రెండు చేతులూ జోడించి దణ్నం పెట్టడం ఇలా ప్రతీ ఫోటో చాలా అందంగా ఉన్నాయి. దీంతో అభిమానులు తెగ మురిసిపోతున్నారు. మహారాణిలా ఉంది, ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తుంది అంటూ ప్రశంసిస్తున్నారు. డిటో రణవీర్, దీపికా డింపుల్స్ వచ్చేశాయి అంటూ కమెంట్స్ చేస్తున్నారు.
కుమార్తె దువా దీపావళి పూజ ఫోటోలను దీపికా పంచుకోవడంపై చాలా మంది సెలబ్రిటీలు, సహనటీనటులు స్పందించారు. డార్క్ మెరూన్ కలర్ డ్రెస్సు, రెండు చిన్ని పిలకలతో పాపాయి అందంగా ఉంది అంటూ నెటిజనులు, సో క్యూట్ అంటూ హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్స్ మురిసిపోగా, దీపికా పదుకొనే కూతురు దువా ఫోటోలకు అలియా భట్ స్పందన విశేషంగా నిలిచింది. పాప ఫోటోలకు లవ్ ఎమోజీతో తన ప్రేమను ప్రకటించింది అలియా.
సబ్యసాచి దుస్తుల్లో మెరిసిన యువరాణి
క్లాసిక్ గ్రేస్ కు పేరుగాంచిన దీపికా పదుకొనే, కస్టమ్ క్రిమ్సన్ సబ్యసాచి డిజైన్ దుస్తుల్లో అందంగా కనిపించారు. గోల్డ్ జర్దోజీతో ఎంబ్రాయిడరీ చేయబడిన కస్టమ్ కుర్తా సెట్,మ్యాచింగ్ దుపట్టాతో పండుగ వైభవాన్ని ప్రతిబింబించేలా మెరిసారు. తన లుక్‌కు సరిపోయేలా, పచ్చలతో కూడిన పోల్కి చైన్ చెవిపోగులు , గాజులను ఎంపిక చేసుకున్నారు. ఇక దీపికతో పాటు, ఆచిన్న యువరాణి దువా కూడా సబ్యసాచి క్రియేషన్‌కు సరిపోయే చిన్న క్రిమ్సన్ కుర్తా, చేతితో తయారు చేసిన గోటా-పట్టి బార్డర్‌లతో ధరించింది. ఎర్రటి చిన్న బొట్టు, పిలకలో జంట తోకల సుందరిగా మెరిసింది. అలాగే రణ్‌వీర్ సింగ్ తెల్లటి కుర్తా సెట్‌లో నెహ్రూ జాకెట్,పసుపు రంగు షేడ్స్ ఉన్న అందమైన, పొడవైన బంగారు నెక్లెస్‌లో అందంగా కనిపించారు.

కాగా దీపికా పదుకొనే, రణబీర్ కపూర్‌ల లవ్ స్టోరీ సినీ అభిమానులకు తెలియందికాదు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన వీరిద్దరూ తమ ఇనీషియల్స్‌ను టాటూ కూడా వేయించుకున్నారు. అయితే వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకుని, వారి వారి కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. రణబీర్, అలియాభట్‌ను పెళ్లి చేసుకోగా, వీరికి ఒక పాప ఉంది.