హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కోయంబత్తూరులోని ఈషా సెంటర్‌లో భూతశుద్ధి పద్ధతిలో వీరి పెళ్లి ఎంతో సింపుల్‌గా జరిగింది. ఈ వివాహం గురించి సంగీత విద్వాంసురాలు శోభారాజు మాట్లాడారు. ఈమె ఎవరంటే.. అన్నమాచార్య సంకీర్తనలతో పాటు సంగీత దర్శకురాలిగా మంచి పేరు గడించింది డాక్టర్ శోభారాజు.
శోభారాజు రియాక్షన్
2010లో ఈమెను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈమెకు రాజ్ నిడిమోరు బంధువవుతాడు. శోభారాజు అక్క రమాదేవి కొడుకే రాజ్ నిడిమోరు. కోడలి వరసయ్యే సమంత గురించి శోభారాజు మాట్లాడుతూ.. ఒక ఆధ్యాత్మిక పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఆశ్రమంలో స్వామివారి ఆధ్వర్యంలో ఈ వివాహ వేడుక జరిగింది. రాజ్ అంటే నాకు చాలా ఇష్టం.
చిన్నప్పటి నుంచే..
వాడు చిన్నగా ఉన్నప్పుడే ముద్దుగారే యశోద.. వంటి పాటలు నేర్చుకుని పాడేవాడు. మీ పిన్ని పేరు నిలబెట్టావని అందరూ వాడిని మెచ్చుకునేవాళ్లు. అది నాకు చాలా సంతోషంగా అనిపించేది. తను సంగీతం నేర్చుకుని ఎన్నో పాటలు పాడాడు. వాడికి స్పిరిచ్యువాలిటీ ఎక్కువ. సమంతకు కూడా ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఉందని తెలిసింది.
పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది
ఓ రెండుసార్లు తను వచ్చినప్పుడు చూశాను, చాలా సన్నగా ఉంది. తన పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది. సన్నగా అవాలంటే ఎలా? అని అడిగినప్పుడు ఏవో ఎక్సర్‌సైజ్‌లు చెప్పింది, కానీ నేను చేయలేనన్నాను. తను మూడు నెలలకోసారి ఈషా ఆశ్రమానికి వెళ్లి మౌనం పాటిస్తూ సాధన చేస్తుందని తెలిసి సంతోషంగా అనిపించింది.
బహుమతులు ఏమిచ్చారంటే?
ఎంతో బిజీ నటి అయుండి ఇలా ధ్యానానికి సమయం కేటాయిస్తుందంటే ముచ్చటేసింది. అలాంటి అమ్మాయి రాజ్‌కు దొరకడం హ్యాపీ. సమంత (Samantha Ruth Prabhu) వాడిని మరింత ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుందని ఆశిస్తుందన్నాను. పెళ్లిలో ఆరోగ్యకరమైన ఆహారమే వడ్డించారు. అలాగే కెమికల్స్ వాడని పర్‌ఫ్యూమ్స్ కానుకగా ఇచ్చారు అని శోభా రాజు చెప్పుకొచ్చారు.


