తమిళ నటుడు కార్తీ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘వా వాత్తియార్’. డిసెంబర్ 12న విడుదల కానుంది. అయితే, తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కృతీ శెట్టి కథానాయికగా నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీని స్టూడియో గ్రీన్ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. 'సత్యం సుందరం' వంటి క్లాసిక్ మూవీ తర్వాత కార్తి నటించిన సినిమా కావడంతో అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఈ మూవీపై కృతీ శెట్టి చాలా ఆశలు పెట్టుకుని ఉంది. ఈ ప్రాజెక్ట్ విజయం సాధిస్తే ఆమెకు కోలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా మరిన్ని ఛాన్సులు రావచ్చు.


