బుల్లితెర నటి సారా ఖాన్ రెండో పెళ్లి చేసుకుంది. నటుడు క్రిష్ పాఠక్‌ను రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. రామాయణ సీరియల్‌లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లాహిరి కుమారుడే క్రిష్ పాఠక్. డిసెంబర్ 5న ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రులు, బుల్లితెర తారల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది.
రెండో పెళ్లి
ఇందుకు సంబంధించిన ఫోటోలను సారా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ కొత్త జంట తమ సంగీత్‌లో కూలీ సినిమాలోని మోనికా సాంగ్‌కు స్టెప్పులేశారు. అలాగే హిందీ పాటలకు సైతం కాలు కదిపారు. కాగా సారా ఖాన్.. సాప్న బాబుల్ కా బిడాయి సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది.
బుల్లితెరపై, వెండితెరపై..
పలు సీరియల్స్‌తో పాటు జర నాచ్‌కే దిఖా, నాచ్ బలియే 4 వంటి డ్యాన్స్ రియాలిటీ షోలలోనూ పాల్గొంది. డార్క్ రెయిన్‌బో, సైనైడ్, హమారీ అధూరీ కహాని వంటి చిత్రాల్లోనూ నటించింది. ఓటీటీలో లాక్ అప్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. హిందీ బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో సారా (Sara Khan) పాల్గొంది. అదే షోలో నటుడు అలీ మర్చంట్ కూడా పాల్గొన్నాడు. బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.
మొదటి పెళ్లి
బయటకు వచ్చాక 2010లో పెళ్లి చేసుకున్నారు. కానీ, వివాహమైన కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. తర్వాత అలీ మర్చంట్ 2016లో అనమ్ మర్చంట్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ బంధం కూడా ఎక్కువకాలం నిలవలేకపోయింది. 2021లో దంపతులిద్దరూ విడిపోయారు. దర్వాత తన స్నేహితురాలు ఆండ్లీబ్ జైదీని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు.


