
లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో చారిటీ ఈవెంట్ "పింక్ బాల్" ఈవెంట్ గ్లామర్‌కు ప్రతిరూపంగా మారింది. బ్రిటిష్ మ్యూజియం డైరెక్టర్ నికోలస్ కల్లినన్‌తో కలిసి, రిలయన్స్ రీటైల్ హెడ్ ఇషా అంబానీ దీనికి సహ అధ్యక్షత వహించారు. అలాగే ఆమె తల్లి, రిలయన్స్ ఫౌండర్ చైర్‌పర్సన్ ,NMACC వ్యవస్థాపకురాలు పింక్ బాల్ థీమ్‌లో అద్భుతమైన లుక్‌లో మెరిసారు.
కీలకమైన కారణాల కోసం నిధులను సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ కార్యక్రమంలో బ్రిటన్ మాజీ ప్రధాని రిషీ సునాక్‌తోపాటు, ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, దాతలు, సామాజిక ,రాజకీయ ఉన్నత వర్గాలకు చెందిన 800 మంది పాల్గొన్నారు. ముఖ్యంగా వ్యాపారవేత్తగా, గొప్ప దాతగా పేరుగాంచిన నీతా అంబానీ తనదైనఫ్యాషన్ లుక్‌తో అలరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేసిన ఈ ఈవెంట్ ఏన్షియంట్ ఇండియా: లివింగ్ ట్రెడిషన్స్'తో పాటు జరిగిన పింక్-నేపథ్య సోయిరీలో సాగింది.
పింక్ బాల్ సహ చైర్‌గా, ఇషా అంబానీ లుక్‌లో వారసత్వం, కళాత్మకత ఉట్టిపడింది. అబు జాని సందీప్ ఖోస్లా ప్రత్యేకంగా రూపొందించిన హ్యాండ్ మేడ్ కోచర్ డ్రెస్‌లో మెరిసి పోయింది. పింక్ ధీమ్‌కు తగ్గట్టుగా బ్లష్ పింక్ చామోయిస్ శాటిన్ జాకెట్ , గులాబీ రంగు జర్డోజీలో ముత్యాలు, సీక్విన్స్ ,స్ఫటికాలతో డిజైన్ స్కర్ట్‌ను ధరించింది.35 మందికి పైగా కళాకారులుదీన్ని తయారు చేయడానికి 3,670 గంటలు శ్రమించారు. దీనికి సంబంధించిన వీడియోను సందీప్ ఖోస్లా షేర్ చేశారు. కార్సెట్ బ్లౌజ్‌ను డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టైల్ చేశారు. అలాగే నీతా అంబానీ స్వదేశ్‌లో తయారు చేసిన కాంచీవరం, మల్బరీ సిల్క్ చీరలో అందంగా కనిపించారు.
ఈ కార్యక్రమానికి మిక్ జాగర్, జానెట్ జాక్సన్, నవోమి కాంప్‌బెల్, సర్ నార్మన్ ఫోస్టర్, లేడీ కిట్టి స్పెన్సర్, ల్యూక్ ఎవాన్స్ , జేమ్స్ నార్టన్ వంటి అనేక మంది సృజనాత్మక ప్రముఖులు హాజరయ్యారు. హాజరైన ప్రతీవ్యక్తి సీటు కోసం 2,000 పౌండ్లు చెల్లించినట్లు తెలుస్తోంది.