
అమెరికాలోని విదేశీ విద్యార్థులకు హెచ్ -1బీ (H-1B) వీసా ఫీజు కింద వసూలు చేసే 1,00,000 డాలర్లను మినహాయిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో టెక్ కంపెనీలకు ఉపశమనం కలిగినట్లయింది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ప్రతిభావంతులను నియమించుకునే సంస్థలకు ఇది మంచి పరిణామం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రకారం F1 వీసాలపై అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు (భారతీయ విద్యార్థులతో సహా) ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వారిని నియమించుకునే కంపెనీలు 1,00,000 డాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇది యూఎస్ కార్పొరేట్ కంపెనీలు, స్టార్టప్‌లకు అక్కడే చదువుతున్న విదేశీ విద్యార్థులను నియామకం చేసుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. అమెరికన్ కంపెనీలు తక్కువ ఖర్చుతో ఈ ప్రతిభను నియమించుకోవడానికి అవకాశం ఏర్పడటంతో ఇది వారికి పెద్ద విజయం అని కొందరు భావిస్తున్నారు.
భారతీయ ఐటీ సంస్థలపై ప్రభావం
భారతీయ ఐటీ సేవల సంస్థలకు ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అభిప్రాయలున్నాయి. సాంప్రదాయకంగా ఈ సంస్థలు భారతదేశం నుంచి ఉద్యోగులను H-1B వీసాలపై బదిలీ చేస్తుంటాయి. వీరి వీసా ఫీజు లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే భాతర ఐటీ కంపెనీలు తాము H-1B వీసాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించామని చెబుతున్నాయి. స్థానికులనే ఎక్కువగా నియమించుకుంటున్నట్లు తెలిజేస్తున్నాయి.
విప్రో వంటి సంస్థల్లో యూఎస్ ఉద్యోగుల్లో దాదాపు 80% మంది స్థానిక ఉద్యోగులేనని సమాచారం. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ సైతం కొద్దిమంది ఉద్యోగులను మాత్రమే ఇమ్మిగ్రేషన్ సేవలకోసం ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. మిగిలినవారు ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్నారని తెలిపారు. టీసీఎస్ కూడా ప్రతి సంవత్సరం వేలాది వీసాల కోసం దాఖలు చేసినా కేవలం 500 మంది మాత్రమే H-1B వీసాపై యుఎస్‌కు వెళ్తున్నట్లు గతంలో తెలిపింది.
ఇదీ చదవండి: ఒక్కరోజులో రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు స్వీకరిస్తున్నారా?