వాహన కొనుగోలుదారుల కోసం ఎంజీ మోటార్ ఇండియా ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చినట్లు చెప్పింది. ‘మిడ్‌నైట్ కార్నివాల్’ పేరుతో డిసెంబర్ 5 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న పరిమితకాల ప్రమోషన్‌లో దేశవ్యాప్తంగా ఎంజీ షోరూమ్‌లు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని చెప్పింది. వినియోగదారులు సౌకర్యవంతమైన సమయాల్లో తమకు నచ్చిన ఎంజీ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసి కొనుగోలు చేయవచ్చని చెప్పింది.
ఈ మూడు రోజుల ఈవెంట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్ (ICE) మోడల్స్‌పై భారీ తగ్గింపులు, ప్రత్యేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. కొనుగోలుదారుల కోసం రూ.11 కోట్ల విలువైన బహుమతుల పూల్ సిద్ధంగా ఉందని పేర్కొంది. ఇందులో అర్హత కలిగిన ఇద్దరు కొనుగోలుదారులు లండన్‌కు ఉచిత ట్రిప్ గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.
మోడల్ వారీగా గరిష్ట ప్రయోజనాలు(ఐసీఈ మోడల్స్‌పై)
| మోడల్ | గరిష్ట ప్రయోజనాలు | ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (దాదాపు) |
|---|---|---|
| గ్లోస్టర్ (Gloster) | రూ. 4 లక్షల వరకు | రూ. 38.33 లక్షలు |
| హెక్టర్ / హెక్టర్ ప్లస్ (Hector / Hector Plus) | రూ. 90,000 వరకు | రూ. 14.00 లక్షలు |
| ఆస్టర్ (Astor) | రూ. 50,000 వరకు | రూ. 9.65 లక్షలు |
ఈవీ మోడల్స్‌పై ప్రయోజనాలు
| మోడల్ | గరిష్ట ప్రయోజనాలు | ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (దాదాపు) |
|---|---|---|
| ZS EV | రూ. 1.25 లక్షల వరకు | రూ. 17.99 లక్షలు |
| కామెట్ EV | రూ. 1 లక్ష వరకు | రూ. 7.50 లక్షలు |
| విండ్సర్ EV | రూ. 50,000 వరకు | రూ. 14.00 లక్షలు |


