యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే సంస్థ ఐఫోన్ ఎయిర్ తీసుకొచ్చింది. దీని ధర రూ. 1,19,900. కానీ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఈ ఫోన్ కేవలం 54,900 రూపాయలకే లభించనుంది. అంటే.. రూ. 65,000 తగ్గుతుందన్నమాట.
నవంబర్ 22 నుంచి ప్రారంభమైన నవంబర్ 30 వరకు సాగే బ్లాక్ ఫ్రైడే సేల్‌లో.. ఐఫోన్ ఎయిర్ మొబైల్ తక్కువ ధరలకు అందుబాటులో ఉండనుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బ్యాంక్ ఆఫర్స్, ఇతరత్రా ఆఫర్స్ పొందినట్లయితే మీకు రూ. 65000 తగ్గుతుందన్నమాట.
ఐఫోన్ ఎయిర్ స్పెసిఫికేషన్స్
యాపిల్ ఐఫోన్ ఎయిర్ 6.5 ఇంచెస్ OLED ప్యానెల్ పొందుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ పొందిన ఈ ఫోన్ 3,000 నిట్స్ పీక్ అవుట్‌డోర్ బ్రైట్‌నెస్ పొందుతుంది. ఇందులో యాపిల్ ప్రత్యేక 7-లేయర్ యాంటీరిఫ్లెక్టివ్ కోటింగ్ అందించింది.
ఐఫోన్ ఎయిర్ A19 ప్రో చిప్‌సెట్‌పై నడుస్తుంది, ఇది ఐఫోన్ 17 ప్రో మరియు ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో ఉపయోగించిన అదే శక్తివంతమైన ప్రాసెసర్. 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ రియర్ కెమెరా, ముందు భాగంలో, 18 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్ & స్కై బ్లూ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది.


