ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త! | How To Get Discounts On Train Tickets Know The Details Here | Sakshi
Sakshi News home page

ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!

Jan 8 2026 3:06 PM | Updated on Jan 8 2026 3:49 PM

How To Get Discounts On Train Tickets Know The Details Here

సంక్రాంతి పండుగ వచ్చేసింది. నగరాల్లో ఉండేవారంతా దాదాపు ఊళ్లకు బయలుదేరుతున్నారు. ఈ సమయంలో ఇండియన్ రైల్వే.. ప్రయాణికులకు ఒక శుభవార్త చెప్పింది. టికెట్ కొనుగోలుపై 3 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం వివరంగా ఇక్కడ..

రైల్‌వన్ యాప్ (RailOne) ద్వారా బుక్ చేసుకున్న అన్‌రిజర్వ్డ్ టిక్కెట్ల బుకింగ్ మీద 3 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇది 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు అందుబాటులో ఉంటుంది. నగదు రహిత ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డిజిటల్ చెల్లింపు మోడ్‌లను ఉపయోగించి RailOne యాప్ ద్వారా బుక్ చేసుకున్న అన్‌రిజర్వ్డ్ టిక్కెట్లపై మాత్రమే తగ్గింపు పొందవచ్చు.

రైల్‌వన్ యాప్ ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ఎలా
➤గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా ఈ సూపర్‌ యాప్‌ ‘Railone’ను డౌన్‌లోడ్‌ చేయాలి.
➤యాప్‌ వినియోగదారుల లొకేషన్‌ను డిఫాల్డ్‌గా రీడ్‌ చేయడానికి అనుమతులు కోరుతుంది. దీన్ని ఆన్‌ చేసుకోవాలి.
➤యాప్‌ ఇన్‌స్టాల్‌ అయిన తర్వాత లాగిన్‌, న్యూ యూజర్‌ రిజిస్ట్రేషన్‌, గెస్ట్‌ అనే ఆప్షన్లు వస్తాయి.
➤కొత్తగా రిజిస్టర్‌ చేసుకోవాలి కాబట్టి న్యూ యూజర్‌ రిజిస్ట్రేషన్‌పై క్లిక్‌ చేస్తే.. రైల్‌ కనెక్ట్‌, యూటీఎస్‌ అని రెండు ఆప్షన్లు డిస్‌ప్లే అవుతాయి. గతంలో ఇప్పటికే రైల్‌ కనెక్ట్‌ యాప్‌లో లాగిన్‌ వివరాలు ఉంటే ఆయా వివరాలతో Railoneలో లాగిన్‌ కావొచ్చు. లేదంటే ➤కొత్తంగా వివరాలు ఎంటర్‌ చేసి సైనప్‌ చేయాల్సి ఉంటుంది.
➤సైనప్‌ కోసం మొబైల్‌ నెంబర్‌ ఇచ్చి రిజిస్టర్‌ చేయాల్సి.
➤మీ పూర్తి పేరు, మొబైల్‌ నెంబరు, ఈ-మెయిల్‌, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, క్యాప్చా ఎంటర్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు.
➤ఓటీపీ, ఎంపిన్‌ ఇచ్చి అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత 2ప్యాక్టర్‌ వెరిఫికేషన్‌ కోసం ఫింగర్‌ ప్రింట్‌ లేదా డివైజ్‌ లాగిన్‌ వివరాలు ఇవ్వాలి.

మూడు శాతం డిస్కౌంట్ కోసం..
👉🏻ఇప్పటికే మీరు ఇన్‌స్టాల్‌ చేసుకున్న RailOne యాప్.. లాగిన్ అవ్వాలి. 
👉🏻ప్రాథమిక వివరాలు (పేరు, ఇతర వివరాలు) నమోదు చేసుకోవాలి.
👉🏻అన్‌రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ కోసం ఎంపికను సెలక్ట్ చేసుకుని.. ప్రయాణ తేదీని, మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారా ఆ స్టేషన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. 
👉🏻డిజిటల్ మోడ్‌ (యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్)  ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది. ఇలా పేమెంట్ చేసినప్పుడు మాత్రం మీకు డిస్కౌంట్ లభిస్తుంది.
👉🏻చెల్లింపు పూర్తయిన తరువాత.. టికెట్ యాప్‌లోనే జనరేట్ అవుతుంది. ప్రయాణ సమయంలో టికెట్ తనిఖీల కోసం దాన్ని మీ ఫోన్‌లో చూపించవచ్చు.

రైల్‌వన్‌ యాప్ ద్వారా లభించే సేవలు
టికెట్ బుకింగ్: ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
ప్లాట్‌ఫామ్ & పార్శిల్ బుకింగ్: వినియోగదారులు ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్శిల్ డెలివరీకి సంబంధించిన సేవలను బుక్ చేసుకోవచ్చు.
రైలు & పీఎన్ఆర్ స్టేటస్: ట్రైన్ షెడ్యూల్‌, పీఎన్ఆర్ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.
ఫుడ్ ఆర్డర్: రైలులో ప్రయాణించే సమయంలో.. ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.
రైల్ మదద్: ఫిర్యాదులు దాఖలు చేయడానికి మరియు సహాయం పొందడానికి ఒక హెల్ప్‌డెస్క్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement