ఐఫోన్‌లపై డిస్కౌంట్స్.. కొనేందుకు సరైన సమయం! | iPhone 17 Pro and 16 Pro Max Get Massive Discounts On Flipkart And Amazon | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌లపై డిస్కౌంట్స్.. కొనేందుకు సరైన సమయం!

Dec 23 2025 5:37 PM | Updated on Dec 23 2025 6:22 PM

iPhone 17 Pro and 16 Pro Max Get Massive Discounts On Flipkart And Amazon

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 ప్రో లాంచ్ అయింది. ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయినప్పటికీ.. చాలామంది ఐఫోన్ 16 ప్రో కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఏ ఫోన్ కొనాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ సంస్థలు కూడా వీటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ & అమెజాన్‌లో ధరలు
యాపిల్ ఐఫోన్ 17 ప్రో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ అమెజాన్ ఇండియాలో రూ.1,34,900కి అందుబాటులో ఉంది. అయితే కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.4,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

ఐఫోన్ 16 ప్రో అసలు ధర రూ.1,19,900 కాగా.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,08,999కు లభిస్తోంది. అంతే కాకుండా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఆఫర్స్ వంటివి ఉపయోగించి అదనపు తగ్గింపులను పొందవచ్చు.

స్పెసిఫికేషన్లు & ఫీచర్లు
ఐఫోన్ 17 ప్రో 6.3 ఇంచెస్ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ & 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌తో జత చేయబడిన Apple A19 Pro చిప్‌సెట్‌ పొందుతుంది. ఇందులో మూడు 48MP సెన్సార్‌లతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు & వీడియో కాల్‌ల కోసం ఇది 18MP ఫ్రంట్ స్నాపర్‌ను కూడా లభిస్తుంది.

ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?

ఇక ఐఫోన్ 16 ప్రో విషయానికి వస్తే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను పొందుతుంది. iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌తో జత చేయబడిన Apple A18 ప్రో చిప్‌సెట్ లభిస్తుంది. అయితే లేటెస్ట్ iOS 26.2కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. హ్యాండ్‌సెట్‌లో రెండు 48MP సెన్సార్లు & వెనుక 12MP సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, వీడియో కాల్స్ & సెల్ఫీల కోసం 12MP కెమెరా లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement