బయో ఏషియా 2026 సదస్సు: ఫిబ్రవరి 16 నుంచి.. | Minister D Sridhar Babu Announces BioAsia 2026 Dates | Sakshi
Sakshi News home page

బయో ఏషియా 2026 సదస్సు: ఫిబ్రవరి 16 నుంచి..

Jan 8 2026 7:12 PM | Updated on Jan 8 2026 7:36 PM

Minister D Sridhar Babu Announces BioAsia 2026 Dates

ఆసియాలో అత్యంత ప్రతిష్టాత్మక లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్-టెక్ సదస్సుగా పేరుగాంచిన బయోఏషియా 2026 (23వ ఎడిషన్) అధికారిక పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ మరియు పరిశ్రమల & వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన సంజయ్ కుమార్, IAS , తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి ఎం నాగప్పన్ పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణతో 2026 ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో జరగనున్న బయో ఏషియా సదస్సు ఏర్పాట్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

గత రెండు దశాబ్దాలుగా బయోఏషియా ఆసియాలోనే ప్రముఖ లైఫ్ సైన్సెస్, బయోఫార్మా, హెల్త్-టెక్ మరియు మెడికల్ ఇన్నోవేషన్  రంగాల్లో ఆసియాలో అగ్రగామి వేదికగా ఎదిగింది.. ప్రతి ఎడిషన్‌లో ప్రపంచ స్థాయి నాయకులు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు విధాన నిర్ణేతలనుఒకే వేదికపైకి తీసుకువస్తోంది. అత్యాధునిక శాస్త్రీయ ప్రగతిని పంచుకుంటున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ బయోఫార్మా, వ్యాక్సిన్‌లు, మెడ్‌టెక్ మరియు డిజిటల్ హెల్త్ ఆవిష్కరణల గ్లోబల్ హబ్‌గా మరింత బలపరుస్తోంది. రాష్ట్రంలోని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన శాస్త్రవేత్తల ప్రతిభ ఈ ఎదుగుదలకు పునాదిగా నిలుస్తున్నాయి.

ఈసారి బయో ఏషియా 2026ను ‘TechBio Unleashed: AI, Automation & Biology Revolution’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఈ థీమ్ ద్వారా బయాలజీ, డేటా, డీప్ టెక్నాలజీ కలయికతో ప్రపంచవ్యాప్తంగా ఔషధ ఆవిష్కరణలు, నిర్ధారణ పద్ధతులు, థెరపీ తయారీ, ఆరోగ్య సేవల అందజేతలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులను ప్రతిబింబిస్తుంది. టెక్‌బయో వల్ల వ్యాధులను అర్థం చేసుకునే విధానం, చికిత్సలను రూపకల్పన చేసే విధానం, వైద్య సేవలను అందించే విధానం పూర్తిగా మార్పు చెందుతోంది. దీని ఫలితంగా ఆరోగ్య సేవలు మరింత ముందస్తు అంచనా విధానంతో, వ్యక్తిగతీకరణతో, అందుబాటులో ఉండే విధంగా మారుతున్నాయి. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ మరింత స్థిరంగా, సమానంగా, అందరికీ చేరువయ్యేలా రూపుదిద్దుకుంటోంది.

బయో ఏషియా 2026 ద్వారా స్టార్టప్‌లు, పరిశోధకులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు మరియు అంతర్జాతీయ సంస్థలకు వ్యూహాత్మక అవకాశాలు లభిస్తాయి. ప్రయోగశాలల్లో జరిగిన ఆవిష్కరణలను మార్కెట్ అవసరాలకు అనుసంధానించడానికి ఈ సదస్సు వారధిగా పనిచేస్తుంది. నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు రోగుల భద్రత మరియు ప్రజా ప్రయోజనాలను కాపాడే విధంగా విధానాలను రూపుదిద్దేందుకు ఇది వేదికగా నిలుస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాగస్వాములను 2026 ఫిబ్రవరి 16–18 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే బయో ఏషియా 2026లో పాల్గొని పెట్టుబడి అవకాశాలను అన్వేషించవలసిందిగా, భాగస్వామ్యాలను బలోపేతం చేయవలసిందిగా మరియు టెక్‌బయో విప్లవంలో భాగస్వాములు కావలసిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement