
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు; కార్తీక మాసం; తిథి:శు.పాడ్యమి సా.5.54 వరకు, తదుపరి విదియ; నక్షత్రం: స్వాతి రా.12.41 వరకు, తదుపరి విశాఖ; వర్జ్యం: లేదు; దుర్ముహూర్తం: ప.11.24 నుండి 12.11 వరకు; అమృత ఘడియలు: ప.3.02 నుండి 4.46 వరకు
సూర్యోదయం : 5.57
సూర్యాస్తమయం : 5.33
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
కార్తీక మాస ప్రారంభం.
మేషం.. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
వృషభం.... బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకోని ప్రయాణాలు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మిథునం..... పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మిత్రులతో కలహాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.
కర్కాటకం.... వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు పెరుగుతాయి.
సింహం..... పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
కన్య.. కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నెమ్మదిగా సాగుతాయి.
తుల.... కార్యజయం. ఆస్తి, ధనలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు. సమస్యలు కొన్ని పరిష్కారం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.
వృశ్చికం.... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
ధనుస్సు..... ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.
మకరం..... పలుకుబడి పెరుగుతుంది. భూలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీకు ఎదురులేని పరిస్థితి.
కుంభం.... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
మీనం.... వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.