ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Horoscope In Telugu From 19-10-2025 To 25-10-2025 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Oct 19 2025 12:03 AM | Updated on Oct 19 2025 12:03 AM

Weekly Horoscope In Telugu From 19-10-2025 To 25-10-2025

మేషం....
అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని సమస్యలు, వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలలో కుటుంబసభ్యుల సలహాలు పాటిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు తథ్యం. కళాకారుల యత్నాలు సఫలీకతమవుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. వ్యయప్రయాసలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, దుర్గాదేవిని పూజించండి.

వృషభం...
మీ సూచనలు, అభిప్రాయాలు బ«ంధువులు గౌరవిస్తారు.  శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు.  ఆర్థిక పరిస్థితి మరింత  మెరుగుపడుతుంది. సన్నిహితులు చేయూతనిస్తారు. ఒక  వ్యక్తి నుండి మీకు ఉపకరించే సమాచారం రావచ్చు.  నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం, ఖర్చులు. ఎరుపు, లేత పసుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం...
కొన్ని సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారు.  కోర్టు కేసుల నుండి విముక్తి పొందుతారు. అందరిలోనూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. మీ కృషిలో బంధువులు భాగస్వాములవుతారు. తగినంత∙ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. వ్యవహారాలు మరింత వేగంగా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో క్లిష్ట సమస్యలు తొలగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గవచ్చు. పారిశ్రామికవర్గాలకు కలసివచ్చే సమయం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఎరుపు రంగులు, గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం..
ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.  బంధువులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు నిరాశాజనకంగా ఉంటుంది.  ఆరోగ్యం చికాకు పరుస్తుంది.  ఒక సమాచారం కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలు కొంత అంసతృప్తి కలిగిస్తాయి.  ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు చికాకులు ఎదురవుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప ధనలాభం. వాహనయోగం. పసుపు, నేరేడు రంగులు, వేంకటేశ్వరస్వామిని పూజించండి.

సింహం....
కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి వ్యవహారాలు పూర్తి చేస్తారు.  మిత్రులతో స్వల్ప విభేదాలు నెలకొంటాయి. నిర్ణయాలతో తొందరపాటు వద్దు. ఆలోచనలు అంతగా కలసిరావు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల శ్రమ కొంతమేర ఫలిస్తుంది. వ్యాపార లావాదేవీలు మధ్యస్థంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం కొంతమేర పెరుగుతుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, గులాబీ రంగులు, దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

కన్య..
అనుకున్న వ్యవహారాలలో  అవాంతరాలు ఎదుర్కొంటారు. ఎంత కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఒక సమాచారం కొంత గందరగోళం కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక విషయాలలో కొంత నిరుత్సాహం. రుణదాతల నుంచి ఒత్తిడులు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో స్వల్ప ధనలాభం. కార్యసిద్ధి. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, దేవీఖడ్గమాల పఠించండి.

తుల...
కొన్ని ఆసక్తికర  విషయాలు తెలుసుకుంటారు. ఆప్తులు, సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.  దూరపు బంధువులను కలుసుకుంటారు. భూవ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పాతసంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధులు కొంత తేలికపడతాయి.. సాంకేతిక నిపుణులు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం...
కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న ఆదాయం సమకూర్చుకుంటారు. ప్రతిభను చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. బం«ధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారుల ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో  స్వల్ప అనారోగ్యం. నిర్ణయాలలో మార్పులు. తెలుపు, గులాబీరంగులు, గణపతి అర్చన చేయండి.

ధనుస్సు..
కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు సంభవం. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో కలహాలు. నీలం, తెలుపు రంగులు, విష్ణుధ్యానం చేయండి.

మకరం...
అనుకున్న వ్యవహారాలలో ఆటంకాలు అ«ధిగమిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. చాకచక్యంగా వ్యవహరించి ముందుకు సాగడం మంచిది. ఆదాయానికి లోటు లేకున్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఒక సమస్య తీరి మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మెలకువ పాటించండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు కాస్త మందగిస్తాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు.  పసుపు, లేత గులాబీ రంగులు, నవహ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం...
శ్రమ పడినా ఫలితం సామాన్యం. కొన్ని  వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమించి పూర్తి చేస్తారు. సహనంతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్యం. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు కొంత నిరాశ తప్పకపోవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని అదనపు బాధ్యతలు తప్పవు. కళాకారులకు నిరుత్సాహం. వారం చివరిలో ధనలాభం. శు¿¶ వార్తలు. గులాబీ, లేత నీలం రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం..
వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ప్రత్యర్థులతో మరింత అప్రమత్తంగా మెలగండి. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. గులాబీ, నేరేడు రంగులు, హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement