గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు,మార్గశిర మాసం, తిథి: శు.చతుర్దశి ఉ.7.45 వరకు, తదుపరి పౌర్ణమి తె.5.21 వరకు (తెల్లవారితే శుక్రవారం), నక్షత్రం: కృత్తిక ప.3.13 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: తె.6.06 నుండి 7.35 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.06 నుండి 10.50 వరకు, తదుపరి ప.2.29 నుండి 3.13 వరకు,అమృత ఘడియలు: ప.12.57 నుండి 2.26 వరకు, శ్రీదత్త జయంతి.
సూర్యోదయం : 6.19
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం... వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
వృషభం.... ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
మిథునం.... ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో నిరుత్సాహం.
కర్కాటకం.... పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.
సింహం..... రుణ విముక్తి పొందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. విందువినోదాలు. కార్యసిద్ధి. సన్మానాలు పొందుతారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.
కన్య.... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో వైరం. ఆరోగ్యభంగం. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
తుల.... బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.
వృశ్చికం... కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన ఉద్యోగయోగం. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.
ధనుస్సు....... పోటీపరీక్షల్లో విజయం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.
మకరం.... పనులు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఉద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
కుంభం..... పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక విషయాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మీనం.... మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు చేపడతారు. ప్రముఖులు పరిచయం. సంఘంలో గౌరవం. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.


