
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.చతుర్దశి ప.2.38 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: హస్త రా.8.12 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: తె.4.55 నుండి 6.39 వరకు (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.55 వరకు, తదుపరి ప.2.28 నుండి 3.14 వరకు, అమృత ఘడియలు: ప.1.51 నుండి 3.32 వరకు, దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.
సూర్యోదయం : 5.57
సూర్యాస్తమయం : 5.34
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం.... కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది. ఆస్తిలాభం. వాహనసౌఖ్యం.
వృషభం... ఆదాయానికి మించి ఖర్చులు. పనిభారం తప్పదు. కార్యక్రమాలలో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.
మిథునం.... రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలలో అవరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ∙ఇబ్బందికరంగా ఉంటుంది.
కర్కాటకం.... ఉద్యోగయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీ అంచనాలు నిజం కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
సింహం... కుటుంబంలో చికాకులు. కార్యక్రమాలలో ఆటంకాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కన్య.... కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యజయం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటుంది.
తుల.... ప్రయాణాలు వాయిదా వేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. కార్యక్రమాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు .
వృశ్చికం... కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధనుస్సు.... పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.
మకరం... చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కళాకారులకు అంచనాలు తప్పుతాయి.
కుంభం... ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
మీనం... కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.