
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: బ.ఏకాదశి ప.1.09 వరకు, తదుపరి ద్వాదశి,నక్షత్రం: మఖ సా.4.41 వరకు, తదుపరి «పుబ్బ, వర్జ్యం: రా.12.54 నుండి 2.33 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.03 వరకు తదుపరి ప.12.10 నుండి 12.56 వరకు, అమృత ఘడియలు: ప.2.16 నుండి 3.53 వరకు, సర్వ ఏకాదశి.
సూర్యోదయం : 5.56
సూర్యాస్తమయం : 5.35
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం.... ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. అనుకున్న పనుల్లో ప్రతిష్ఠంభన. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృషభం.... సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మిథునం..పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
కర్కాటకం....కొన్ని సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిష్ఠంభన. అనారోగ్యం. మిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
సింహం..... కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
కన్య... కొత్త రుణాలు చేస్తారు. కొన్ని వ్యవహారాలు ముందకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త అనుకూలత.
తుల.... ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృశ్చికం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు.
ధనుస్సు... శ్రమాధిక్యంతో పనులు పూర్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడులు. దైవదర్శనాలు. కుటుంబంలో స్వల్ప సమస్యలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో సమస్యలు
మకరం.. పనులలో ఆటంకాలు. స్వల్ప అనారోగ్యం. బంధువర్గంతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. దైవదర్శనాలు.
కుంభం.... శుభకార్యాలపై చర్చలు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి ఒప్పందాలు. కుటుంబంలో సమస్యలు తీరే సమయం. ఆప్తులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మీనం.... విలువైన వస్తువులు సేకరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.