
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం,తిథి: బ.త్రయోదశి ప.1.35 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: ఉత్తర రా.6.34 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: రా.3.32 నుండి 5.15 వరకు, దుర్ముహూర్తం: సా.4.01 నుండి 4.46 వరకు, అమృత ఘడియలు: ప.11.02 నుండి 12.41 వరకు, మాస శివరాత్రి, నరకచతుర్దశి.
సూర్యోదయం : 5.56
సూర్యాస్తమయం : 5.348
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం... పనుల్లో విజయం. ఆప్తులతో ముఖ్య విషయాలపై చర్చలు. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.
వృషభం.. మానసిక ఆందోళన. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ముఖ్య పనులలో కొంత జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు.
మిథునం... మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
కర్కాటకం... కొత్త మిత్రుల పరిచయం. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
సింహం... వ్యయప్రయాసలు. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ధనవ్యయం. ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
కన్య..... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకం.
తుల..... మిత్రులు శత్రువులుగా మారతారు. పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
వృశ్చికం..... దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. కొన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
ధనుస్సు.. పనుల్లో పురోగతి. కుటుంబసమస్యలు తీరతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
మకరం... సన్నిహితులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. కీలక సమాచారం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కుంభం... ఆర్థిక ఇబ్బందులు, బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వృత్తులు, వ్యాపారాలు కొంత మందగిస్తాయి. దైవదర్శనాలు.
మీనం... నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆస్తిలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.