
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: బ.దశమి ప.1.40 వరకు, తదుపరి ఏకాదశి,నక్షత్రం: ఆశ్లేష సా.4.29 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: తె.4.35 నుండి 6.12 వరకు (తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.37 వరకు, తదుపరి ప.2.30 నుండి 3.17 వరకు,అమృత ఘడియలు: ప.2.55 నుండి 4.30 వరకు.
సూర్యోదయం : 5.56
సూర్యాస్తమయం : 5.36
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం... కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి..
వృషభం... చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితుల సాయం అందుతుంది. ముఖ్య పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు.
మిథునం... ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. కళాకారులకు అవకాశాలు చేజారతాయి.
కర్కాటకం.... విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. భూలాభాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో సమర్థత చాటుకుంటారు. దైవదర్శనాలు.
సింహం.... పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆరోగ్య సమస్యలు.
కన్య.... కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. పాతమిత్రులను కలుసుకుంటారు. యుక్తితో శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు. వస్తులాభాలు.
తుల... పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. వాహనయోగం.
వృశ్చికం... ముఖ్యమైన పనుల్లో అవరోధాలు. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కళాకారులకు నిరాశ. ధార్మిక చింతన.
ధనుస్సు... కాంట్రాక్టర్లకు నిరాశ తప్పదు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో విభేదాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు.. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
మకరం....... ప్రముఖ వ్యక్తుల నుంచి కీలక సందేశం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు,మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కళాకారులకు ఊరట.
కుంభం...... ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం..... కొత్తగా రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. నిరుద్యోగుల ప్రయత్నాలు కాస్త మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన ప్రగతి కనిపించదు.