గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: శు.నవమి సా.4.55 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: భరణి ప.9.28 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.8.39 నుండి 10.09 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.53 నుండి 9.35 వరకు తదుపరి రా.10.54 నుండి 11.44 వరకు, అమృత ఘడియలు: తె.5.34 నుండి 7.04 వరకు (తెల్లవారితే బుధవారం).
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.49
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
వృషభం.... వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.
మిఛునం... శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కర్కాటకం.. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చికాకులు అధిగమిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.
సింహం..... రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో చికాకులు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.
కన్య..... ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఆస్తి వివాదాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు నెలకొంటాయి.
తుల..... పాతబాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. సంఘంలో ఆదరణ. మిత్రుల నుంచి సహాయం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
వృశ్చికం... యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
ధనుస్సు... బంధువులతో అకారణంగా తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది.
మకరం.... పనులు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు అంతంతగా అనుకూలించవు. ఆస్తి వివాదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.
కుంభం.. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి.పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కొత్త విషయాలు తెలుస్తాయి. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
మీనం..... అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిర ంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. పనులలో ఆటంకాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.


