
అధిక బరువు తగ్గడం అతిపెద్ద సమస్య కాదు అని నిరూపిస్తున్నారు పలువురు. మెరుగైన ఫలితాలు రావాలంటే సరైన విధంగా, మంచి నిపుణుల సలహాల సూచనలు పాటించాలి. ఈ అధిక బరువుకి చెక్‌పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించేది కేవలం డైట్ మాత్రమే కాదు, వర్కౌట్లుదే అగ్రస్థానం. ఎందుకంటే శారీరక శ్రమతో ఫ్యాట్‌ని కరిగించడమే గాక బరువులో మార్పులు కూడా సంభవిస్తాయి. కొందరికి చేతులు, కాళ్లు, పిరుదులు బాగా లావుగా కనిపిస్తాయి. ఆ ప్రదేశాల్లోని కొలెస్ట్రాల్ తగ్గి..ఫ్లాట్‌గా అవ్వడమేగాక చెక్కిన శిల్పంలా ఆకృతి మారాలంటే ఈ వ్యాయామాలు తప్పనిసరి అంటోంది ఫిట్‌నెస్ కోచ్ సాచి పాయ్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా చూద్దామా..!.
టొరంటోకు చెందిన ఈ ఫిట్‌నెస్ కోచ్ సాచి పాయ్(Saachi Pai) జస్ట్ 15 నెలల్లో 40కిలోలు పైనే బరువు తగ్గింది. అంతలా బరువు తగ్గడంలో తనకు హెల్ప్ అయిన వ్యాయామాలు, ఆహారాలు గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.
బరువు తగ్గడంలో మార్పులు బాహ్యంగా కనిపించాలంటే..కాళ్లు, చేతులు, పిరుదుల సైజ్ తగ్గితేనే..బరువు తగ్గినట్లు తెలుస్తుంది. అందుకోసం ఈ ఐదు వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయలంటోంది సాచి పాయ్.
సైడ్ రైజెస్
ఈ వ్యాయామం కోసం నిటారుగా నిలబడి ప్రారంభించాలి. ఒక కాలును పక్కకు ఎత్తి, దానిని నిటారుగా ఉంచండి. కాలును నెమ్మదిగా క్రిందికి తీసుకురండి ..ఇలా పునరావృతం చేయాలి.
ముందు, వెనుక కిక్స్
ఎత్తుగా నిలబడి, ఒక కాలును ముందుకు తన్నండి, ప్రారంభానికి తిరిగి వెళ్లి, ఆపై దానిని వెనుకకు తన్నండి. ఆ తర్వాత యథాస్థానానికి వచ్చి..కదలికలను నియంత్రించాలి. ఇలా కొన్నిసార్లు రిపీట్ చేయండి.
సింగిల్ ఇన్నర్ లెగ్ రైజెస్
మీ దిగువ కాలును నిటారుగా ఉంచి, పై కాలును దానిపై వంచి సైడ్‌కు పడుకోండి. ఇది, లోపలి తొడలపై ఒత్తిడి కలుగుజేసేలా దిగువ కాలును పైకి ఎత్తండి. ఇలా మీ కాలును నెమ్మదిగా తగ్గించి.. పునరావృతం చేయండి. నిర్దిష్ట సంఖ్యలో ప్రాక్టీస్ అయ్యాక..మరోవైపకి తిరిగి ఇలానే పునరావృతం చేయాలి..
ఫైర్ హైడ్రాంట్స్
నాలుగు కాళ్లపై ప్రారంభించండి, ఒక మోకాలిని పక్కకు ఎత్తండి, దానిని వంచి ఉంచండి. వ్యాయామం చేస్తున్నప్పుడు మీ తుంటిని తిప్పవద్దు. ఇప్పుడు, వీపును క్రిందికి తగ్గించి రెండో కాలికి ఇలానే వ్యాయామం రిపీట్ చేయండి.
డాంకీ కిక్స్
నాలుగు కాళ్లపై నిలబడి, ఒక మోకాలిని వంచి, మడమను పైకప్పు వైపుకు ఎత్తాలి. ఈ వ్యాయామాలు కొవ్వును కాల్చడానికి, టోన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. పలితంగా శిల్పంలా శరీరాకృతి మారేందుకు దోహదపడుతుంది.
ఈ వ్యాయామాలు నిపుణుల పర్యవేక్షణలో సరిగా చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారని, అదే తప్పుగా చేస్తే లేనిపోని శారీరక సమస్యలు తప్పవని చెప్పుకొచ్చారు. సాధ్యమైనంతవరకు నిపుణుడైన ఫిట్‌నోస్ పర్వవేక్షకుడి సమక్షంలో నేర్చుకోవడమే మంచిదని సూచిస్తున్నారు సాచిపాయ్.
(చదవండి: 44 కిలోల బరువు తగ్గిన ఫిట్‌నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్‌లాస్ పాఠాలు..)