
ఆరోగ్యకరమైన జీవినశైలి బరువు తగ్గడానికి సంబంధించి..తప్పుదారి పట్టించే ఇన్ఫర్మేషన్ కారణంగానే చాలామంది వెయిట్‌లాస్ కాలేకపోతుంటారని చెబుతున్నాడు ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ యష్ వర్ధన్ స్వామి. కొందరు విఫల ప్రయత్నం చేసి విసిగిపోయినవాళ్లు కూడా ఉన్నారని అంటున్నాడు. తాను ఒకప్పుడు అధిక బరువు ఉండేవాడనని, ఇప్పుడు వెయిట్‌లాస్ అయ్యి ఆరోగ్యకరమైన బరువుకి చేరుకున్నాని కూడా చెప్పారు.
ఆ మార్పు కొన్ని పాఠాలను నేర్పించిందని, అవి శ్రేయోభిలాషులకు తప్పక ఉపయోగపడతాయాంటూ..తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు బరువు తగ్గడం అనేది క్రమ శిక్షణ, మనసును కంట్రోల్ చేయడం వంటి అంశాలను తప్పక నేర్పిస్తుందని అంటన్నారు. వాటి కారణంగా బరువు తగడ్డం అనేది ఆధారపడి ఉంటుందట. మరి అదెలా అనేది ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.
ఫిట్‌నెస్ ట్రైనర్(Fitness coach) యష్ వర్ధన్ స్వామి(Yash Vardhan Swami) 13ళ్ల క్రితం వరకు అధిక బరువుతో ఉండేవాడనని చెప్పారు. ఆ తర్వాత 44 కిలోలు మేర బరువు తగ్గి విజయవంతమయ్యాక..కొన్ని విషయాలు ప్రస్ఫుటంగా అర్థమయ్యాయన్నారు. తను క్రమంగా బరువు తగ్గుతున్నప్పుడూ సంతరించుకున్న మార్పుని గమనిస్తూ..నేర్చుకున్న వెయిట్‌లాస్ పాఠాలను గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బరువు తగ్గడం అనే శారీరక సవాలు.. మానసిక భావోద్వేగాలను సంబంధించిన అంశమని నొక్కి చెప్పారు. ఇక్కడ ఊబకాయం(Obesity) అనేది కేవలం శరీర సమస్య కాదు, జీవిత సమస్య అని అన్నారు.
దీని కారణంగా అన్ని సంబంధాలు కోల్పోతామట. ముఖ్యంగా ఆరోగ్యం, సంపద, సంబధాలపై ప్రభావం చూపి..పూర్తిగా సత్సంబంధాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. అలాగే వెయిట్‌లాస్ జర్నీలో అతి ముఖ్యమైన సవాలు మనసుతో యుద్ధం చేయడమేనని అన్నారు. కొలస్ట్రాల్ తగ్గించుకుంటే బరువు తగ్గుతామని అందరికీ తెలుసు. అది కార్యరూపంలోకి రావాలంటే..మనసు కంట్రోల్‌లో ఉండాలన్నారు. అప్పుడే మనం వేసుకునే వెయిట్‌లాస్ ప్లాన్ సక్సెస్ అవ్వగలదు.
అది నియమానుసారంగా సాగితే..క్రమశిక్షణ, నిబద్ధత అలవడుతుందట. ఎప్పుడైతే మనలో ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అప్పుడూ కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి ఆటోమేటిగ్గా మద్దతు లభించడమే కాదు..మనకో ప్రాముఖ్యత ఏర్పడేలా మన రూపురేఖల్లో మార్పులు సంతరించుకుంటాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇంకొక విషయం తప్పక గుర్తించుకోండి అంటూ..ఊబకాయం ఏమి రాత్రికి రాత్రికి మన జీవితాన్ని నాశనం చేయదని చెప్పారు.
మన ఆహారపు అలవాట్లతో రోజువారిగా నెమ్మదిగా మన సౌందర్యాన్ని దెబ్బతీసేలా బరువు పెరుగుతుంటామని అన్నారు. అందుకే ఎదుట వ్యక్తులకు శారీరక పరంగా మనపట్ల ఉన్న అభిప్రాయాన్ని లైట్ తీసుకోవద్దని అని సూచిస్తున్నారు. అప్పుడే లోపాన్ని సరిచేసుకునే యత్నం చేసి..బరువు తగ్గేందుకు ట్రై చేస్తామని అన్నారు. అందుకు మనసు తోపాటు డెడికేషన్ అనేది అత్యంత ప్రధానమని గ్రహించమని సూచించారు ఫిట్‌నెస్ కోచ్ యష్ వర్ధన్ స్వామి.
(చదవండి: పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!)