
కడు దుర్భరమైన జీవితం గడిపి..కనీస అవసరాలనే సమకూర్చుకోలేని స్థితిలో గడిపాడు ఆ యువకుడు. ఎంతలా అంటే కనీసం బాత్రూం కూడా లేని ఇంట్లో జీవితం భారంగా నెట్టుకొచ్చాడు. ఈ స్థితిని చూసి చిన్నపాపల ఏడుస్తున్నా తల్లిని చూసి..ఏ చేయలో తోచని చిన్నతనంలోనే ఆ యువకుడి మదిలో నిలిచిన ధ్యేయం..అతడితోపాటు పెరుగుతూ వచ్చింది. అదే తన పేదరికాన్ని జయించే స్థితికి చేరేలా చేసింది. ఇవాళ తన అమ్మ సంబరపడేల కలల సౌధాన్ని నిర్మించాడు. కష్టబడితే మన కలలన్నీ ఎన్నటికి వృధాకావు అనే మాటకు అర్థాన్నిచ్చేలా స్ఫూర్తిగా నిలిచాడు. ఈ స్టోరీ రెడ్డిట్‌లో షేర్ అవ్వడంతో నెట్టింట వైరల్‌గా మారింది.
రెడ్డిట్‌లో ఆ యువకుడు అంతకుముందు తాము ఉండే పాత ఇల్లు తాలుకా ఫోటోను షేర్ చేస్తూ..అప్పుడూ తన లైఫ్ ఎంత దయనీయం ఉంటుందో చెప్పుకొచ్చాడు. వర్షం వస్తే ఇంట్లోకి వచ్చేసే మురుగు నీరు మధ్య ఎలా బిక్కుబిక్కుమంటూ గడిపామా గుర్తు చేసుకున్నాడు. అది చూసి తన తల్లి పసిపాపలా ఏడ్చిన ఘటన ఇంకా మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు.
అయితే తాను ఏం చేయలేని చిన్నవాడిని కావడంతో..ఎలాగైనా దీన్ని మార్చాలని కలలు కనేవాడని అంటూ తన పరిస్థితిని వివరించాడు. కనీసం ఇంట్లో బాత్రూం కూడా లేకపోవడంతో తన తల్లి, అక్క తాత్కాలిక కచ్చా నిర్మాణాన్ని ఏర్పరుచుకున్నారని, తను తండ్రి ఆఫీస్‌లోని వాష్‌రూమ్ వాడుకునేవాడినంటూ నాటి పేదరిక జీవితంలోని గడ్డు పరిస్థితులను తెలిపాడు.
ఇదంతా ఎలా మార్చాలనేది తెలియకపోయినా..తండ్రికి భారం కాకుండా చదువుకోవడంపై దృష్టిపెట్టి..చిన్న చిన్న ట్యూషన్‌లు చెప్పేవాడినని అన్నాడు. అయితే ఏదో ఒకరోజుకి ధనవంతుడిని అవుతాననే కలను మాత్రం వదిలేయలేదని..అది ఎప్పుడూ కళ్ల ముందు సాక్షాత్కారిస్తూనే ఉండేదని చెప్పుకొచ్చాడు. అదే చివరికి నాకు తన తల్లి మెచ్చుకునేలా కలల సౌధాన్ని నిర్మించేలా చేసిందని, కానీ కొంత అప్పుకూడా చేయాల్సి వచ్చిందని వివరించాడు.
అప్పుడు తాన ఎలాంటి ఇంట్లో జీవించేవాడో..ఇప్పుడూ ఎలాంటి ఇంట్లో నివసించే రేంజ్‌కి వచ్చాడో తెలిపేలా అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశాడు. చివరికి తాను "పేదరికం అనే యుద్ధంపై గెలిచేశా, నా తల్లి కలలుగన్న ఇంటిని కట్టేశా" అనే క్యాప్షన్ జోడించి మరి తన కథను వివరించాడు. ఈ స్టోరీ నెటిజన్లను ఆకట్టుకోవడమే కాదు..తమను ఎంతాగనో ప్రేరేపించిందంటూ..సదరు వ్యక్తిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఏంటి క్రెడిట్ కార్డుతో గిన్నిస్ రికార్డు? కేవలం ఖర్చే కాదు ఆదాయం కూడా..)