అధిక బరువు అనేది సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, ప్రముఖులు వరకు అందరూ ఫేస్ చేస్తున్న సమస్య. ఓ పట్టాన బరువు తగ్గలేక చాలామంది ఇటీవల కాలంలో ఒజెంపిక్ ఇంజెక్షన్ల బాట పడుతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి అగ్రరాజ్యం మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా కూడా చేరిపోయారా, ఆమె కూడా దీన్ని వినియోగిస్తున్నారా అనే ఊహగానాలు వెల్లువెత్తాయి. అందుకు కారణం ఇటీవల ఆమె నెట్టింట పోస్ట్ చేసిన ఫోటోలే. అందులో మిచెల్ ఎంత నాజుకుగా అయిపోయారంటే..చూపుతిప్పుకోనివ్వనంత అందంగా మారిపోయారామె.
గత వారాంతంలో 61 ఏళ్ల మిచెల్ ఒబామా ప్రముఖ అమెరికన్ ఫోటోగ్రాఫర్ అన్నీ లీబోవిట్జ్ ప్రచార ఫోటో షూట్‌కి సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసుకున్నారామె. అందులో ఆమె లైట్‌కలర్ జీన్స్, ప్లెయిన్ గ్రే టీ-షర్టు విత్ గోధుమ రంగు సూడ్ బూట్‌లతో చాలా ఫిట్‌గా కనిపించారు. దాంతో అందరూ ఆమె అంతలా సన్నగా ఎలా మారిపోయిందనే సందేహాలు మొదలయ్యాయి.
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు వ్యాయమం కంటే ఈజీగా బరువు తగ్గించే ఒజెంపిక్ ఔషధాన్ని ఉపయోగించినట్లు అంగీకరించారు. బహుశా ఆమె కూడా వారి బాటలోనే నడిచారా అని నెటిజన్లలో ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఇదిలా ఉండగా మిచెల్ తన పుస్తకం "ఉమెన్" మాదిరిగా చేశారామె. మనం స్త్రీలను ఎలా చూస్తామో..అంతకుమించి అన్నట్లు సాగిపోవడమే కాదు తన దృక్పథంతో లైఫ్‌ని లీడ్ చేయగలదు కూడా. ఈ రోజు మహిళలు చాలా రకాలుగా తనను తాను నిరూపించుకుంటున్నారు. మీరు కూడా నాలాగే ఈ డెవలప్‌మెంట్‌ని స్ఫూర్తిదాయకంగా భావిస్తారని ఆశిస్తునన్నా అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్‌లో రాసుకొచ్చింది.
కాగా, ఓజెంపిక్ అనేది టైప్ 2 డయాబెటిస్‌ను నిర్వహించడానికి ఆమోదించబడిన మందు. ఇది వారానికొకసారి ఇచ్చే మందు. బరువు నిర్వహణ ప్రయోజనాల నిమిత్తం ప్రజాధరణ పొందిన ఔషదం. గత సెప్టెంబర్‌లో ఆ ఔషధం తయారీదారు డానిష్ నోవో నార్డిస్క్, భారతదేశంలో కూడా దీన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు.
(చదవండి: ప్రకృతి వైద్యమే మంచిదా..! నటి సోనాలి బింద్రే సైతం..)


