చాలామందిని వేధించే సమస్య డయాబెటిస్. గణాంకాలు సైతం రానున్న రోజుల్లో భారత డయాబెటిస్ కేరాఫ్‌గా మారనుందంటూ హెచ్చరిస్తున్నాయి కూడా. కొందరికి అధిక బరువుతో మొదలై డయాబెటిస్ బారినపడి ఇబ్బందులు పడుతున్నవారెందరో. కానీ కొందరూ ఆ వ్యాధి రావడంతోనే మేల్కొని ఆరోగ్య స్పృహ తెచ్చుకుని మరి బరువు తగ్గడమే కాదు డయాబెటిస్‌ని ితిప్పుకొడుతున్నారు. ఆ కోవలో ఈ కామెడీ హీరో కూడా చేరిపోయి ప్రేరణ కలిగిస్తున్నారు. ఏకంగా 78 ికిలోలు వరకు బరువు ఉండే ఆయన అంతలా ఎలా బరువు తగ్గారో సవివరంగా తెలుసకుందామా...!.
అమెరికా హాస్య నటడు 'మైక్ అండ్ మోలీ' స్టార్ బిల్లీ గార్డెల్ టైప్ 2 అధికబరువుతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు. డయాబెటిస్ నిర్ధారణ అయ్యేటప్పటికీ సుమారు 172 కిలోలు పైనే బరువు పెరిగిపోయాడు. సరిగ్గా 2020లో రక్తంలో చక్కెర స్థాయిలు అధికమయ్యేంత వరకు మేల్కొలేదు. అదీగాక ఆ టైంలో మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో బిల్లీ గార్డెల్ అధిక బరువు, స్లీప్ అప్నియా, ధూమపానం చేసేవాడు, టైప్ 2 డయాబెటిస్, ఉబ్బసం వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుండేవాడు.
ఓపక్క కరోనా మహమ్మారి,మరోవైపు అనారోగ్యా జాబితాతో భయాందోళనలకు లోనై ఆరోగ్య స్పృహపై ఫోకస్ పెట్టాడు. కానీ తగ్గుదామని ఉపక్రమించిన ప్రతిసారి పెరిగిపోవడంతో లాభం లేదనుకుని..తన వ్యక్తిగత వైద్యులతో చర్చించి మరి బరువు తగ్గించే సర్జరీలకు ప్లాన్ చేశాడు.
మార్పు వచ్చిందా అంటే..
ఈ 53 ఏళ్ల గార్డెల్ జూలై 2021లో బారియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇది అతడి పరివర్తనలో తొలి అడుగు. ఆహారం విషయంలో తీసుకున్న జాగురకత..మంచి మార్పుకి శ్రీకారం చుట్టింది. కడుపు ఫుల్‌గా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో ఓదార్పునిచ్చే ఆహారం తీసుకుంటూ..ఆకలిని నియంత్రించగలిగాడు. అలా 78 కిలోల వరకు అధిక బరువుని తగ్గించుకుని స్లిమ్‌గా హీరోలా మారిపోయాడు. అంతేగాదు డయాబెటిస్ కూడా నయం అయిపోయింది.
ఇది మంచిదేనా అంటే..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారు గణనీయమైన బరువు తగ్గడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌ను తిప్పికొట్టగలరని చెబుతున్నారు. ఇక్కడ హాస్య నటుడు కాలేయం , క్లోమంలో కొవ్వును తగ్గించి.. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచాడు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి వీలు కల్పించి డయాబెటిస్ నుంచి ఉపశమనం అందిస్తుంది.
అయితే బరువు పెరిగితే మాత్రం మళ్లీ డయాబెటిస్ తిరగబెట్టొచ్చు. అందువల్ల ఇలా సర్జరీ చేయించుకున్నవాళ్లు ఆ బరువుని మెయింటైన్ చేసేలా..జీవనశైలిలో మార్పులు, వ్యాయామం తదితరాల విషయాల్లో కేర్ తీసుకుంటే చాలని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఇక్కడ బరువు తగ్గించే సర్జరీతో కేవలం ఐదు నుంచి పది శాతమే బరువు తగ్గుతారని, ఆ తర్వాత అంతా ఫిజికల్‌గా మనం కష్టపడి స్లిమ్‌గా మారాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం . పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: భారత్ గుర్తింపును "మధురంగా" మార్చిన మహిళ..!ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..)


