సాధారణంగా వివాహంలో సప్తపది అనే తంతు ఉంటుంది. ధర్మేచ, కామేచ అంటూ వధువరులు చేత ఏడు ప్రమాణాలు చేయిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ వరుడు వెరైటీగా ఎనిమిదో ప్రమాణం చేయిస్తాడు. పాపం ఆ వధువుకి అంగీకరించక తప్పలేదు. ఇంతకే ఏంటా ప్రమాణం అంటే..
ఢిల్లీలో జరిగి వివాహ వేడుకలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. మయాంక్ దియా అనే వధువరుల వివాహం అంగరంగ వైభవంగా సాగుతుంది. సరిగ్గా సప్తపది తంతు వచ్చింది. అందరి వధువరులానే ఈ జంట ఆ ప్రమాణాలు చేసింది. కానీ ట్వీస్ట్ ఏంటంటే వీటి తోపాటు ఇంకో ప్రమాణం కూడా చేద్దాం అనగానే ఒక్కసారిగా అంతా షాకయ్యారు. ఎనమిదో వచనం(ప్రమాణంగా) ఈ రోజు నుంచి మన గదిలో ఏసీ ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచుదాం అని చెబుతాడు.
సాంప్రదాయ హిందూ వివాహంలో జంట సాధారణంగా పవిత్ర అగ్ని చుట్టూ తిరుగుతూ..ఏడు పవిత్ర ప్రమాణాలు చేస్తారు. దీనని సప్తపది అంటారు. అయితే మయాంక్ ఎనిమిదో వచనంగా చెప్పించిన ప్రమాణం ఆ వధువుకి ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం కదూ..!. మయాంక్ ఈ పెళ్లి వేడుకలో సడెన్‌గా మైక్ తీసుకుని మరి తన కాబోయే భార్యతో ఈ ఎనిమిదో ప్రమాణం చేయించడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బ్రో భార్యను అడగకుండానే ఈ ప్రమాణం చేయించావే..ముందే గ్రిప్‌లో పెట్టుకుంటున్నావా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: పేరు మార్చేసుకున్న ఇండిగో?! వైరల్‌గా హర్ష్ గోయెంకా పోస్ట్)


