saptapadi
-
సక్సెస్‌కు ‘సప్త’పది! ‘కొత్త’గా ఇన్వెస్ట్ చేద్దాం..
నిన్న మొన్నటిదాకా పెట్టుబడులు పోటెత్తాయి. దీంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. కొత్త గరిష్ఠ స్థాయిలను నమోదు చేశాయి. ఆ పరిస్థితుల నుంచి ఇపుడు మార్కెట్లు ఆటుపోట్ల దశవైపు మళ్లాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మార్కెట్లు విపరీతమైన ఊగిసలాటకు గురవుతున్న తరుణంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. గత కొన్నాళ్లుగా ఈక్విటీలు పటిష్టంగా ర్యాలీలు చేస్తుండటంతో ఇన్వెస్టర్లు అటువైపు మొగ్గు చూపటం వారికి మంచి లాభాలనే ఇచ్చింది. కానీ 2027 ఆర్థిక సంవత్సరం కాస్త విభిన్నంగా ఉండబోతోంది. అంతర్జాతీయంగా వృద్ధిపై అనిశ్చితి నెలకొంది. ద్రవ్యోల్బణం దిగి వస్తున్నా, అంత తేలిగ్గా లొంగడం లేదు. వడ్డీ రేట్లు కూడా మరీ దూకుడుగా ఏమీ తగ్గడం లేదు. భారతీయ ఇన్వెస్టర్లకు దేశీయంగా పటిష్టమైన వృద్ధి వల్ల అవకాశాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ, విధానాలను కాస్త మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది, రాబడులపై ఆశలతో గుడ్డిగా పరుగెత్తడం కాకుండా, పెట్టుబడులను స్మార్ట్‌గా తీర్చిదిద్దుకోవాల్సి ఉంది. దానికోసం ఉపయోగపడే ఏడు వ్యూహాల సమాహారమే ఈ వెల్త్ స్టోరీ... ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు ఆర్థిక లక్ష్యాల మదింపు చాలా మంది ఇన్వెస్టర్లు ఒక్కసారి లక్ష్యాలను నిర్దేశించుకున్నారంటే చాలు మళ్లీ వాటిలో మార్పులు, చేర్పులు చేసుకోరు. అయితే, కాలక్రమేణా మార్కెట్ పరిస్థితులు, ఆదాయ స్థాయిలు, వ్యక్తిగత బాధ్యతలు మారుతుంటాయి. కాబట్టి మీరు పెడుతున్న పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది పునఃసమీక్షించుకునేందుకు ఈ కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఒక చక్కని అవకాశంగా మార్చుకోవాలి. ఉదాహరణకు మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యానికి 2–3 ఏళ్లే ఉన్నప్పుడు భారీ స్థాయిలో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే ఒడిదుడుకులపరంగా అనవసర రిసు్కలు ఎదురుకావచ్చు. అదే రిటైర్మెంట్ లేదా సంపదను పెంచుకోవడంలాంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టి ఉంటే ఈక్విటీల్లో అధిక పెట్టుబడులను కొనసాగించవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఆటో పైలట్ మోడ్‌లో పెట్టుబడులు పెట్టుకుంటూ పోవడం కాకుండా లక్ష్యానికి ఉన్న వ్యవధికి తగ్గట్లుగా కేటాయింపులు మార్చాల్సి ఉంటుంది.అసెట్ అలోకేషన్ని సరి చేసుకోవడం ఇపుడు అన్నింటికన్నా పెద్ద రిస్కు మార్కెట్ ఒడిదుడుకులు కాదు.. కేవలం ఒకే పెట్టుబడి సాధనంలో, అందులోనూ, ఈక్విటీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడమే రిస్కీ వ్యవహారం. చాలా మటుకు పోర్ట్‌ఫోలియోలు అనుకోకుండానే ఈక్విటీల్లో భారీగా ఇన్వెస్ట్ చేసి ఉంటాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లలో ఒకే రకమైన రిటర్నులు రాకపోవచ్చు. కాబట్టి, అసెట్ అలొకేషన్పై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈక్విటీ, డెట్, పసిడితో సమతూకమైన పోర్ట్‌ఫోలియో ఉంటే షాక్లేవైనా ఎదురైనా తట్టుకుంటూ సంపదను పెంచుకునేందుకు వీలవుతుంది. ఉదాహరణకు... ఈక్విటీలు పతనమైనప్పుడు, డెట్ సాధనాలు స్థిరత్వాన్ని అందిస్తాయి. ఇక గ్లోబల్ అనిశి్చతికి పసిడి హెడ్జింగ్ సాధనంగా పని చేస్తుంది. వార్షికంగా రీబ్యాలెన్సింగ్ చేసుకోవడం వల్ల పోర్ట్‌ఫోలియోకి మీరు నిర్దేశించుకున్న స్థాయికి మించి రిస్కులు ఎదురవకుండా చూసుకోవచ్చు.డైవర్సిఫికేషన్ ప్రధానం పెట్టుబడుల్లో వైవిధ్యం పాటించడమంటే బోలెడన్ని మ్యూచువల్ ఫండ్స్ కలిగి ఉండాలనే అపోహ ఒకటి ఇన్వెస్టర్లలో ఉంది. వాస్తవానికి సదరు ఫండ్స్ అన్నీ కూడా ఒకే రకమైన రంగాలు లేదా మార్కెట్ క్యాప్‌లకు చెందినవైతే, అప్పుడు కూడా మొత్తం పోర్ట్‌ఫోలియోలో ఒకే తరహా పెట్టుబడులున్నట్లే అవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో సిసలైన డైవర్సిఫికేషన్ అంటే వివిధ అసెట్ క్లాస్‌లు, భౌగోళిక ప్రాంతాలు, పెట్టుబడి వ్యూహాలపై దృష్టి కేంద్రీకరించడం. ఈక్విటీల విషయానికొస్తే, స్థిరత్వం కోసం లార్జ్ క్యాప్స్‌లో, అడాప్టబిలిటీ కోసం ఫ్లెక్సి క్యాప్స్‌లో, సమతూకం కోసం డెట్, పసిడిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కొంత ఇన్వెస్ట్ చేస్తే డైవర్సిఫికేషన్ మరింతగా ఉంటుంది.ఒడిదుడుకులు.. వ్యూహాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటుపోట్లు ప్రత్యేకంగా కనిపించనున్నాయి. ఇన్వెస్టర్లు వీటిని రిస్కులుగా అనుకోకుండా, అవకాశాలుగా మార్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) చక్కగా పని చేస్తాయి. దీనివల్ల కాలక్రమేణా కొనుగోలు రేటు సగటు స్థాయికి వస్తుంది. అయితే, మార్కెట్లు కరెక్షన్లకు లోనైనప్పుడు సిప్‌లతో పాటు వ్యూహాత్మక పెట్టుబడులను కూడా జోడిస్తే స్మార్ట్ విధానంగా ఉంటుంది. ఉదాహరణకు మార్కెట్లు అర్థవంతంగా తగ్గితే, అదనంగా పెట్టుబడులను కొద్ది కొద్దిగా పెట్టడం వల్ల దీర్ఘకాలిక రాబడులు మెరుగుపడతాయి. మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నప్పుడు భావోద్వేగాలతో కాకుండా క్రమశిక్షణతో వ్యవహరించడం ముఖ్యం.లిక్విడిటీ పటిష్టం చేసుకోవాలి అనిశ్చితిలో రాబడులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో లిక్విడిటీకి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని పట్టించుకోరు. ఫలితంగా చాలా మటుకు డబ్బును మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. నిర్మాణాత్మకమైన ఆర్థిక ప్రణాళికలో కనీసం ఆరు నెలలకు సరిపడే ఎమర్జెన్సీ నిధి కూడా ఉంటుంది. అనూహ్య పరిస్థితులు ఏవైనా తలెత్తితే దీర్ఘకాలిక పెట్టుబడులను ఉపసంహరించుకోకుండా ఇది తోడ్పడుతుంది. లిక్విడిటీ ఉంటే ప్రధాన పోర్ట్‌ఫోలియోని డిస్టర్బ్ చేయకుండా మార్కెట్లో వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలవుతుంది.పోర్ట్‌ఫోలియోలో డెట్ సాధనాలకూ చోటివ్వండి ఈక్విటీ మార్కెట్లు బాగున్నప్పుడు డెట్ పెట్టుబడులను పెద్దగా పట్టించుకోరు. కానీ రాబడులు ఒక మోస్తరు స్థాయికి పరిమితమై, వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్న దశలో వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. డెట్ సాధనాల వల్ల అంచనాలకు అనుగుణమైన రాబడులు వస్తాయి. పోర్ట్‌ఫోలియోలో ఆటుపోట్లు తగ్గుతాయి. మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న దశలో పోర్ట్‌ఫోలియోకి కాస్త స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడిని సంరక్షించుకోవడం చాలా కీలకంగా ఉండే స్వల్పకాలిక, మధ్యకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి 2026–27లో అత్యంత నాణ్యమైన డెట్ సాధనాలకు సమతూకంగా కేటాయిస్తే, భారీ రాబడులు లేకపోయినా, రిసు్కకు తగ్గట్లుగా మెరుగైన రాబడులను అందుకునేందుకు వీలవుతుంది. క్రమశిక్షణ ముఖ్యం సాధారణంగా సరైన ఫండ్‌ని ఎంపిక చేసుకుంటే చాలు మంచి రాబడులు వస్తాయనే దృష్టితో చాలా మంది ‘అత్యుత్తమ మ్యూచువల్ ఫండ్‌ని వెతికి పట్టుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తుంటారు. నిజానికి, నిలకడ, క్రమశిక్షణ, అసెట్స్‌కి సరైన అలొకేషన్ చేయడమే దీర్ఘకాలికంగా ప్రయోజనాలను అందిస్తాయి. ఇటీవలి కాలంలో పనితీరు బాగుండటం లేదంటూ మాటిమాటికీ ఫండ్స్‌ని అటూ ఇటూ మార్చడం వల్ల అసలుకే మోసం వస్తుంది. దీనివల్ల భారీ వేల్యుయేషన్స్కి కొనుక్కుని, తాత్కాలికంగా పడగానే, ని్రష్కమించినట్లవుతుంది. అలా గాకుండా మెరుగ్గా నిర్వహిస్తున్న కొద్ది ఫండ్స్‌ని ఎంచుకుని, పెట్టుబడులను కొనసాగిస్తూ, మధ్యమధ్యలో వాటిని సమీక్షించుకుంటూ ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ తాత్కాలిక భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల గాకుండా క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడం వల్లే మంచి ఫలితాలు పొందవచ్చు. కొత్త ఆర్థిక సంవత్సరంలో దూకుడుగా, అస్తవ్యస్తంగా పెట్టుబడులను పెడితే ఫలితాలు దక్కేలా లేవు. ఎవరైతే సమతూకం, నిలకడ, రిస్క్ మేనేజ్మెంట్పై ప్రధానంగా ఫోకస్ చేస్తారో వారికే ప్రయోజనాలు లభిస్తాయి. మార్కెట్ కదలికలను ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నం చేయడం కాకుండా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే విధంగా పోర్ట్‌ఫోలియోని తీర్చిదిద్దుకోవడం స్మార్ట్ వ్యూహంగా ఉంటుంది. లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను సరిచేసుకుంటూ, సరైన అసెట్ అలొకేషన్ని పాటిస్తూ, సమర్ధవంతంగా డైవర్సిఫై చేస్తూ, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఇన్వెస్టర్లు ఒకవైపు దీర్ఘకాలికంగా సంపదను పెంచుకుంటూనే మరోవైపు అనిశ్చితి నుంచి బైటపడొచ్చు. చివరగా చెప్పేదేమిటంటే, గొప్ప ఫలితాలు సాధించాలంటే ఏదైనా అసాధారణమైనది చేయడం కాదు.. నిలకడగా కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటే చాలు. -
వివాహంలో వరుడు సప్తపది తోపాటు మరొక ప్రమాణం..!
సాధారణంగా వివాహంలో సప్తపది అనే తంతు ఉంటుంది. ధర్మేచ, కామేచ అంటూ వధువరులు చేత ఏడు ప్రమాణాలు చేయిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ వరుడు వెరైటీగా ఎనిమిదో ప్రమాణం చేయిస్తాడు. పాపం ఆ వధువుకి అంగీకరించక తప్పలేదు. ఇంతకే ఏంటా ప్రమాణం అంటే..ఢిల్లీలో జరిగి వివాహ వేడుకలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. మయాంక్ దియా అనే వధువరుల వివాహం అంగరంగ వైభవంగా సాగుతుంది. సరిగ్గా సప్తపది తంతు వచ్చింది. అందరి వధువరులానే ఈ జంట ఆ ప్రమాణాలు చేసింది. కానీ ట్వీస్ట్ ఏంటంటే వీటి తోపాటు ఇంకో ప్రమాణం కూడా చేద్దాం అనగానే ఒక్కసారిగా అంతా షాకయ్యారు. ఎనమిదో వచనం(ప్రమాణంగా) ఈ రోజు నుంచి మన గదిలో ఏసీ ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచుదాం అని చెబుతాడు. సాంప్రదాయ హిందూ వివాహంలో జంట సాధారణంగా పవిత్ర అగ్ని చుట్టూ తిరుగుతూ..ఏడు పవిత్ర ప్రమాణాలు చేస్తారు. దీనని సప్తపది అంటారు. అయితే మయాంక్ ఎనిమిదో వచనంగా చెప్పించిన ప్రమాణం ఆ వధువుకి ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం కదూ..!. మయాంక్ ఈ పెళ్లి వేడుకలో సడెన్‌గా మైక్ తీసుకుని మరి తన కాబోయే భార్యతో ఈ ఎనిమిదో ప్రమాణం చేయించడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బ్రో భార్యను అడగకుండానే ఈ ప్రమాణం చేయించావే..ముందే గ్రిప్‌లో పెట్టుకుంటున్నావా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Shaadi Reelz | Wedding Content Creator (@shaadireelz) (చదవండి: పేరు మార్చేసుకున్న ఇండిగో?! వైరల్‌గా హర్ష్ గోయెంకా పోస్ట్) -
విశ్వనాథ వనితలు
పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు అరచేతులు అడ్డుపెడుతుంది ఒక స్త్రీ. ఒక గొప్ప నాట్యకారుడి అంతిమ రోజులను అర్థమంతం చేస్తుంది మరో స్త్రీ. తనలోని కళను తాను కనుగొనడానికి గొప్ప సంఘర్షణ చేస్తుంది ఒక స్త్రీ. వ్యసనపరుడైన భర్తను సంస్కరించడానికి ఎడబాటు నిరసనను ఆశ్రయిస్తుంది మరో స్త్రీ. ప్రేమకు కులం లేదు అనే స్త్రీ... వరకట్నం వద్దు అనే స్త్రీ.. మందమతితో జీవితాన్ని పునర్నిర్మించుకునే స్త్రీ. అతడు చూపిన స్త్రీలు ఆత్మాభిమానం కలిగిన స్త్రీలు. ఆత్మవిశ్వాసాన్ని కలిగిన స్త్రీలు. భారతీయ సంస్కృతిని గౌరవించాలనుకునే స్త్రీలు. కె.విశ్వనాథ్ 92వ జన్మదినం సందర్భంగా.... ఆమెకు సంగీతం, నృత్యం అంటే ప్రాణం. కాని తల్లి ఆమెను ఒక వేశ్యను చేయాలనుకుంటుంది. బలవంతంగా ఆమెపై అత్యాచారం జరిగేలా చూస్తుంది. ఆమె కడుపున నలుసు పడుతుంది. కాని అది ఇష్టం లేని సంతానం. ఒక పాము కాటేస్తే వచ్చిన గర్భం. పుట్టబోయేది కూడా పామే. ఆమె అబార్షన్ చేయించుకోదు. ఆత్మహత్య చేసుకోదు. ఆ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు సంగీతం నేర్పిస్తుంది. తరువాత తను దేవుడిగా భావించే శంకరశాస్త్రి దగ్గరకు పంపి ఆయన శిష్యుడిగా మారుస్తుంది. బయట దారిలో కనిపిస్తే ‘పాము’ పామే అవుతుంది. కాని శివుని మెడలో ఉండి కనిపిస్తే ‘శంకరాభరణం’ అవుతుంది. అథోముఖమైన తన జీవితాన్ని ఊర్థ్వంలోకి మార్చుకుని సంతృప్తి పొందిన ఆ స్త్రీ ‘శంకరాభరణం’లో మంజుభార్గవి. ఆ పాత్రను అంత తీక్షణంగా, ఔన్నత్యంగా తీర్చిదిద్దినవారు దర్శకడు కె.విశ్వనాథ్. ఒక కళాకారుణ్ణి తెలుసుకోవాలంటే అతడు పుట్టించిన పాత్రలను చూడాలి. మహిళల పట్ల అతడి దృక్పథం తెలియాలంటే అతడు సృష్టించిన మహిళా పాత్రలను చూడాలి. కె.విశ్వనాథ్ సృష్టించిన మహిళా పాత్రలు ప్రేక్షకులకు నచ్చిన పాత్రలు. ప్రేక్షకులు మెచ్చిన పాత్రలు. అంతేకాదు పరోక్షంగా తమ ప్రభావాన్ని వేసే పాత్రలు. ‘శుభలేఖ’ సినిమాలో సుమలత లెక్చరర్. ఎంతో చక్కని అమ్మాయి. ఆమెతో జీవితం ఏ పురుషుడికైనా అపురూపంగా ఉండగలదు. కాని ఆమెను కోడలిగా తెచ్చుకోవడానికి బోలెడంత కట్నం అడుగుతాడు ఆ సినిమాలో పెద్దమనిషి సత్యనారాయణ. డబ్బు, కానుకలు, కార్లు... ఒకటేమిటి అడగనిది లేదు. ఆత్మాభిమానం ఉన్న ఏ అమ్మాయి అయినా ఊరుకుంటుందా? సుమలత తిరగబడుతుంది. సంతలో పశువును కొన్నట్టు వరుణ్ణి కొననని చెప్పి సంస్కారం ఉన్న వ్యక్తి హోటల్లో వెయిటర్ అయినా సరే అతణ్ణే చేసుకుంటానని చిరంజీవిని చేసుకుంటుంది. మనిషికి ఉండాల్సిన సంస్కార సంపదను గుర్తు చేస్తుంది ఈ సినిమాలో సుమలత. ‘సాగర సంగమం’లో జయప్రద ఫీచర్ జర్నలిస్ట్. చదువుకున్న అమ్మాయి. భారతీయ కళలు ఎంత గొప్పవో తెలుసు. అందుకే కమల హాసన్‌లోని ఆర్టిస్ట్‌ను గుర్తించింది. అతణ్ణి ఇష్టపడటం, కోరుకోవడం జరక్కపోవచ్చు. అతడి కళను ఇష్టపడటం ఆపాల్సిన అవసరం లేదని గ్రహిస్తుంది. విఫల కళాకారుడిగా ఉన్న కమల హాసన్ చివరి రోజులను అర్థవంతం చేయడానికి అతడిలోని కళాకారుణ్ణి లోకం గుర్తించేలా చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంది. తన కుమార్తెనే అతని శిష్యురాలిగా చేస్తుంది. ఆమె రాకముందు అతడు తాగుబోతు. కాని మరణించే సమయానికి గొప్ప కళాకారుడు. స్త్రీ కాదు లత. ఒక్కోసారి పురుషుడే లత. ఆ లతకు ఒక దన్ను కావాలి. ఆ దన్ను జయప్రదలాంటి స్త్రీ అని ఆ సినిమాలో విశ్వనాథ్ చూపిస్తారు. ‘సప్తపది’లో ఆ అమ్మాయి అతడి కులాన్ని చూడదు. అతడి చేతిలోని వేణువునే చూస్తుంది. ఆ వేణునాదాన్నే వింటుంది. ఏడడుగుల బంధంలోకి నడవాలంటే కావాలసింది స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడే పరస్పర ప్రేమ, గౌరవం. అంతే తప్ప కులం, అంతస్తు కాదు. సంప్రదాయాల కట్టుబాట్లు ఉన్న ఇంట పుట్టినా హృదయం చెప్పిందే చేసిందా అమ్మాయి. ఆమె ప్రేమను లోకం హర్షించింది. యువతకు లక్ష్యం ఉందా? కళ పట్ల అనురక్తి ఉందా? తమలోని కళను కాకుండా కాసులను వెతికే వేటను కొనసాగిస్తే అందులో ఏదైనా సంతృప్తి ఉందా? ‘స్వర్ణకమలం’లో గొప్ప నాట్యగత్తె భానుప్రియ. కాని ఆ నాట్యాన్ని ఆమె గుర్తించదు. ఆ కళను గుర్తించదు. ఒక కూచిపూడి నృత్యకళాకారిణిగా ఉండటం కన్నా హోటల్లో హౌస్‌కీపింగ్‌లో పని చేయడమే గొప్ప అని భావిస్తుంది. ఆ అమ్మాయికి ధైర్యం ఉంది. తెగువ ఉంది. చురుకుదనం ఉంది. టాలెంట్ ఉంది. స్వీయజ్ఞానమే కావాల్సింది. కాని చివరలో ఆత్మసాక్షాత్కారం అవుతుంది. తను గొప్ప డ్యాన్సర్ అవుతుంది. మూసలో పడేవాళ్లు మూసలో పడుతూనే ఉంటారు. కొత్తదారి వెతికినవారు భానుప్రియ అవుతారు. మీరు మాత్రమే నడిచే దారిలో నడవండి అని చెప్పిందా పాత్ర. లైఫ్‌లో ఒక్కోసారి ఆప్షన్ ఉండదు. మనం టిక్ పెట్టేలోపలే విధి టిక్ పెట్టేస్తుంది. ‘స్వాతిముత్యం’లో రాధికకు భర్త చనిపోతాడు. ఒక కొడుకు. ఆ కష్టం అలా ఉండగానే మందమతి అయిన కమల హాసన్ తాళి కట్టేస్తాడు. అంతవరకూ ఆమె జీవితం ఏమిటో ఆమెకు తెలియదు. ఇప్పుడు ఒక మీసాలు లేని, ఒక మీసాలు ఉన్న పిల్లాడితో కొత్త జీవితం నిర్మించుకోవాలి. ఆమె నిర్మించుకుంటుంది. అతణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది. అడ్డంకులను జయించుకుంటూ అతడి ద్వారా తన జీవితాన్ని జయిస్తుంది. స్థిర సంకల్పం ఉంటే కష్టాలను దాటొచ్చని చెబుతుంది. కె.విశ్వనాథ్ మహిళా పాత్రలలో స్వాతిముత్యంలో రాధిక పాత్ర మర్చిపోలేము. ‘శృతిలయలు’లో సుమలత భర్త రాజశేఖర్. కళకారుడు. కాని స్త్రీలోలుడు అవుతాడు. వ్యసనపరుడవుతాడు. లక్ష్యరహితుడవుతాడు. అతణ్ణి సరిచేయాలి. దానికి ఇంట్లో ఉండి రాద్ధాంతం పెట్టుకోదు ఆమె. కొడుకును తీసుకుని దూరం జరుగుతుంది. హుందాగా ఉండిపోతుంది. ఎదురు చూస్తుంది. ఏ మనిషైనా బురదలో ఎక్కువసేపు ఉండలేరు. రాజశేఖర్ కూడా ఉండలేకపోతాడు. మగాడికి గౌరవం కుటుంబంతోనే అని గ్రహిస్తాడు. మగాడికి గౌరవం భార్య సమక్షంలోనే అని గ్రహిస్తాడు. మగాడికి గౌరవం ఒక లక్ష్యంతో పని చేయడమే అని గ్రహిస్తాడు. ఆమె పాదాల దగ్గరకు తిరిగి వస్తాడు. విశ్వనాథ్ సృష్టించిన స్త్రీలు లౌడ్‌గా ఉండరు. కాని వారు స్పష్టంగా ఉంటారు. సౌమ్యంగా ఉంటారు. స్థిరంగా సాధించుకునే వ్యక్తులుగా ఉంటారు. సమాజంలో స్త్రీలకు ఉండే పరిమితులు వారికి తెలుసు. కాని వాటిని సవాలు చేయడం పనిగా పెట్టుకోకుండా ఆ ఇచ్చిన బరిలోనే ఎలా విజయం సాధించాలో తెలుసుకుంటారు. విశ్వనాథ్ స్త్రీలు తెలుగుదనం చూపిన స్త్రీలు. మేలిమిదనం చూపిన స్త్రీలు. అందమైన స్త్రీలు... రూపానికి కాని... వ్యక్తిత్వానికి కాని! సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చిమంటే శ్రీలచ్చి అవతారం – సాక్షి ఫ్యామిలీ -
మృదుమధురమైన భాష తెలుగు
ఈడే పల్లి(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : నుడికారాలు, అలంకారాలు, చందోగణాలతో వర్థిల్లుతున్న మృదుమధురమైన భాష తెలుగు అని కృష్ణా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఎంకే దుర్గాప్రసాద్ అన్నారు. సాహితీ మిత్రులు సంస్థ 33వ వార్షికోత్సవం శనివారం బచ్చుపేటలోని మహతి లలిత కళావేదికపై ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న దుర్గాప్రసాద్ ప్రముఖ ర చయిత్రి వారణాసి సూర్యకుమారి రచించిన ‘సప్తపది’ నవలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ వివాహ ధర్మాల్ని, ప్రయోజనాల్ని వివరిస్తూ సూర్యకుమారి రాసిన ఈ గ్రంథం అద్భుతంగా ఉందన్నారు. డాక్టర్ గురజాడ రాజేశ్వరి గ్రంథ సమీక్ష చేశారు. సామితీ మిత్రులు కవితల సంకలనం ‘సుకవి స్వరాలు’ గ్రంథాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వై.కృష్ణారావు ఆవిష్కరించారు. సింహాద్రి పద్మ గ్రంథ సమీక్ష చేశారు. రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు జి.సుబ్బారావు, సిటీ కేబుల్ మేనేజర్ బి.పుల్లారావు మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కైకలూరు మండలం భుజబలపట్నం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు శ్రావణ లక్ష్మి, గిరిజాతులసి, దేవీప్రశాంతి, శిల్పాదేవి, తెలుగు పండితులు కేవైఎల్ నరసింహం, మేరీ కృపాబాయి, కె.కనకదుర్గ, పి.వెంకటేశ్వరరావు, టి.రాధికారాణి నిర్వహించిన పద్య ప్రజ్ఞావధానం ఆహూతులను ఆకట్టుకుంది. అనంతరం కవిత, సంఘసేవ, కళాసేవలో కృషిచేసిన కావలి కోదండరావు(ఒడీశా), యు.శ్రీనివాసరావు, మహ్మద్ అబ్దుల్ గఫార్‌లకు వామన కవిత ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ రావి రంగారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వి.పూర్ణచంద్రరావు, కార్యదర్శి ఆదుమర్తి సుహాసినీ, ఉపాధ్యక్షురాలు కె.కల్పన, కోశాధికారి ముదిగొండ సీతారావమ్మ, డాక్టర్ ధన్వంతరి ఆచార్య, సీహెచ్ ప్రమీల పాల్గొన్నారు.


