దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత నాలుగు రోజులుగా విమాన సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 5) ఒక్క రోజే 400కి పైగా విమానాలను రద్దు చేసింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ అంతరాయంపై ఇండిగో అధికారికంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది కూడా. రద్దయిన అన్ని విమానాలకు ఆటోమేటిక్‌గా ఒరిజినల్ పేమెంట్ మోడ్‌కు పూర్తి రీఫండ్ ప్రాసెస్ చేస్తామని చెప్పింది. ఈతరుణంలో నెట్టింట పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా హాస్యస్పదంగా చేసిన పోస్ట్ హాట్‌టాపిక్ మారింది.
ఆ పోస్ట్‌లో వరసగా నాలుగో రోజున కూడా విమాన సర్వీసులు అంతరాయం కొనసాగుతుండగా, గోయెంకా ఎయిర్‌లైన్ లోగోతో కూడిన సరికొత్త పేరును నెటిజన్లతో ఇలా పంచుకున్నారు. కొనసాగతున్న విమాన సర్వీసులు అంతరాయం నేపథ్యంలో తమ ఎయర్‌లైన్స్ పేరు మార్పు అంటూ.. “ఇట్ డిడ్న్'ట్ గో”, అని సరదాగా ఇలా పోస్ట్ చేశారు. అంతే నిమిషాల్లో ఈ పోస్ట్‌వైరల్ అయిపోయింది. చాలామంది ప్రయాణికులు ఈ జోక్‌ను మన నిరాశను ప్రతిబింబిస్తుందని చెప్పడం విశేషం.
భారతదేశంలోని అతిపెద్ద విమానాయాన సంస్థ ఈ వారం ప్రారంభం నుంచి వందలాది సేవలను రద్దు చేసింది, ఢిల్లీ, బెంగళూరు మరియు చెన్నై వంటి ప్రధాన కేంద్రాలలో ప్రయాణీకులను ఇబ్బందులకు గురిచేసింది. ఫలితంగా ప్రత్యామ్నాయ విమానాల టిక్కెట్ల ధరల అమాంతం పెరిగేందుకు కారణమైంది. ఇక గోయెంకా చేసిన పోస్ట్ విమానాల రద్దుతో ఎయిర్‌పోర్ట్‌లో చిక్కకుపోయిన ప్రయాణికులను ఎంతాగానో ఆకట్టుకుంది.
నెటిజన్లంతా "ఇండిగో ఇండిగో నుంచి ఇట్ డిడ్ డిట్ గోకు వెళ్లడం క్రేజీగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తదుపరి అప్‌డేట్ పేరు మార్పు కాదని ఆశిస్తునన్నాం అలాగే ఇక ఈ ఆలస్యం కొనసాగదని ఆశిస్తున్నాం అని పోస్టులు పెట్టారు. కానీ కొంతమంది విమాన చరిత్రలోనే ఇంతలా విమాన సర్వీసుల రద్దు అనేది భలే ట్విస్టింగ్‌గా ఉన్నా..బహుశా లోగో కూడా రీబ్రాండ్ కోరుకుంటుందేమో అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ విమాన సర్వీసులు అంతరాయం పూర్తిగే తగ్గే వరకు గోయెంకా పోస్ట్ వైరల్ అవుతూనే ఉంటుంది కాబోలు.
Name change announced…. pic.twitter.com/Pd3JJiE6CG
— Harsh Goenka (@hvgoenka) December 5, 2025
(చదవండి: ఏఐ చాట్‌బాట్‌తో జర జాగ్రత్తోయ్..!)


