ఇండిగో ఎఫెక్ట్‌.. ప్రయాణీకులకు రైల్వే శాఖ ఆఫర్‌ | Indian Railways Adds 116 Coaches To 37 Trains Amid IndiGo | Sakshi
Sakshi News home page

ఇండిగో ఎఫెక్ట్‌.. ప్రయాణీకులకు రైల్వే శాఖ ఆఫర్‌

Dec 6 2025 9:37 AM | Updated on Dec 6 2025 9:56 AM

Indian Railways Adds 116 Coaches To 37 Trains Amid IndiGo

ఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులకు ఓ ఆఫర్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పలు కీలక నగరాల మధ్య నడిచే 37 ప్రీమియం రైళ్లలో 116 అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్టు రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో, పలు నగరాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం ప్లాన్‌ చేసింది.

ఇండిగో విమాన రద్దు తర్వాత ప్రయాణీకుల డిమాండ్ పెరిగిన దృష్ట్యా భారత రైల్వే దేశవ్యాప్తంగా పలు రైళ్లలో బోగీల సంఖ్యను పెంచింది. దక్షిణ రైల్వే (SR) పరిధిలో నడిచే రైళ్లలో అత్యధిక సంఖ్యలో 18 రైళ్లకు బోగీలను పెంచినట్టు తెలిపింది. అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో అదనపు చైర్ కార్, స్లీపర్ క్లాస్ కోచ్‌లను పెంచినట్టు అధికారులు తెలిపారు. 6 డిసెంబర్ 2025 నుండి ఇది అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.

ఇక, ఉత్తర రైల్వే (NR) ఎనిమిది రైళ్లలో బోగీలను పెంచారు. పలు రైళ్లలో 3AC, చైర్ కార్ కోచ్‌లను అదనంగా జత చేశారు. పశ్చిమ రైల్వే (WR)లో నాలుగు రైళ్లకు 3AC, 2AC కోచ్‌లను జత చేశారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) 2025 డిసెంబర్ 6-10 మధ్య ఐదు ట్రిప్పులకు అదనంగా 2AC కోచ్‌లతో రాజేంద్ర నగర్-న్యూఢిల్లీ (12309) మధ్య అదనంగా పెంచారు. ఇది బీహార్-ఢిల్లీ సెక్టార్‌లో మెరుగైన రవాణాను అందించనుంది.

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECOR) ఐదు ట్రిప్పులకు 2AC కోచ్‌లను జోడించడం ద్వారా భువనేశ్వర్-న్యూఢిల్లీ సేవలను (రైళ్లు 20817/20811/20823) పెంచింది. ఒడిశా-ఢిల్లీ రాజధాని మధ్య కనెక్టివిటీని మెరుగుపరచనుంది. గోరఖ్‌పూర్-ఆనంద్ విహార్ టెర్మినల్-గోరఖ్‌పూర్ స్పెషల్ (05591/05592) డిసెంబర్ 7 మరియు 9 మధ్య నాలుగు ట్రిప్పులను నడుపుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement