లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణరంగ పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించలేకపోతున్నట్లు రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ చెప్పారు. లోక్‌సభలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవా బిస్తూ.. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా రక్షణ తయారీ రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్‌లు (కేంద్ర పథకాలు) ప్రారంభించలేదని తెలిపారు.
వైద్య పరికరాల ఎగుమతుల్లో వృద్ధి
మన దేశం నుంచి వైద్య పరికరాల ఎగుమతులు 2021–22లో 2.9 బిలియన్ డాలర్లుండగా 2024–25లో 4.1 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువులశాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. వైద్యపరికరాల దేశీయ ఉత్పత్తి వృద్ధిరేటు ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు.
ఐఆర్‌ఎస్‌పై నాలుగే ఫిర్యాదులు
గత పదేళ్లలో ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్‌ఎస్) పనితీరులో జరిగిన అక్రమాలు, అవకతవకలు, ఆలస్యాలకు సంబంధించి నాలుగు ఫిర్యాదులు మాత్రమే అందినట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్,
వాటర్‌వేస్ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్.. వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రశ్నకు సమాధానమిచ్చారు.


