అక్టోబర్ 6వ తేదీన ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ నకిలీ మద్యం డంప్ (ఫైల్‌ఫోటో)
విజయవాడ: వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన ఘటనపై తాజాగా కేసులు నమోదు కావడం కూటమి సర్కార్ వేధింపులు కొనసాగింపునకు మరొక ఉదాహరణ. అక్టోబర్ 7వ తేదీన ఇబ్రహీంపట్నంలో జనార్థన్‌రావుకు చెందిన గోడౌన్‌లో నకిలీ మద్యం డంప్‌ను ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తర్వాత వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో కలిసి డంప్‌ను పరిశీలించారు జోగి రమేష్.
దీనిపై ఇప్పుడు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ రోజు తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఇప్పుడు అక్రమ కేసులు నమోదుఉ చేశారు పోలీసులు. విచారణకు రావాలని 20 మంది వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులిచ్చారు. దీనిపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. ఎప్పుడో రెండు నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు కేసులు నమోద చేయడం కక్ష సాధింపు చర్య కాకపోతే ఏంటని ప్రశ్నించింది.


