కర్నూలు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల కోసం గంపమట్టివేయలేదని సీపీఎం జాతీయ నాయకులు గఫూర్ విమర్శించారు. చంద్రబాబుకు అమరావతి తప్ప వేరే అజెండా ఏమీ లేదని మండిపడ్డారు. అమరావతి కోసం లక్షల కోట్లు అప్పులు తెస్తున్నావని, చేసింది మాత్రం ఏమీ లేదని ధ్వజమెత్తారు.
చంద్రబాబు రోజు ఉపన్యాసాలు చేస్తుంటావు కాని ఆలూరులో రోడ్ల పరిస్థితి ఒకసారి చూడు. జిల్లాల సమగ్రాభివృద్ధికి కొరకు నంద్యాల జిల్లా చేశారు వైఎస్ జగన్. అదే విదంగా చంద్రబాబు ఆదోని జిల్లా చేయాలి. కర్నాటక ప్రభుత్వం ఆంధ్ర నీళ్ళను జల దోపిడీ చేస్తున్నా.. చంద్రబాబుకు పట్టదు. చంద్రబాబు వేదవతి ప్రాజెక్టు కోసం ఒక రూపాయి నిధులు ఇవ్వలేదు. చంద్రబాబు ప్రాజెక్టులు కోసం గంప మట్టివేయలేదు. చంద్రబాబు పోలవరం ,అమరావతి తప్ప వేరే అజెండా పట్టదు’ అని మండిపడ్డారు.


