చాయ్‌వాలా ఇంట తనిఖీలు.. షాకైన అధికారులు | How Chaiwala Turn Cyber Fraud Kingpin From Bihar Full Details | Sakshi
Sakshi News home page

చాయ్‌వాలా ఇంట ఆకస్మిక తనిఖీలు.. షాకైన అధికారులు

Oct 21 2025 10:22 AM | Updated on Oct 21 2025 10:32 AM

How Chaiwala Turn Cyber Fraud Kingpin From Bihar Full Details

పక్కా సమాచారంతో ఓ మారుమూల పల్లెలోని ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అయతే ఆ రైడ్‌లో ఏకంగా కోటి రూపాయల నగదుతో పాటు బంగారం, కొంత వెండి, కుప్పలుగా ఏటీఎం కార్డులు, బ్యాంక్‌ పాస్‌ బుక్‌లు, ఆధార్‌ కార్డులు, చెక్‌బుక్‌లు, ల్యాప్‌ల్యాప్‌, సెల్‌ ఫోన్స్‌ చూసి షాకయ్యారు. ఈ క్రమంలో ఆ చాయ్‌వాలా సోదరుడ్ని విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.

బీహార్‌ గోపాల్‌గంజ్‌ అమైతీ ఖుర్ద్ గ్రామంలో అంతరాష్ట్ర సైబర్‌ మాఫియా బయటపడడం కలకలం సృష్టించింది. ఓ చిన్న టీ స్టాల్‌ నడిపించే అభిషేక్‌ కుమార్‌, అతని సోదరుడు ఆదిత్య ‘సైబర్‌ మాఫియా’ నడుపుతున్నారంటే పోలీసులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. సైబర్‌ నేరాలకు పాల్పడుతూ.. ఆ వచ్చిన నగదును పక్కా ప్లాన్‌తో వైట్‌లోకి మార్చేసుకుంటున్నారు ఈ అన్నదమ్ములు.  అలా వచ్చిన సొమ్ముతో విలాసాలు అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది.

అన్నదమ్ముల ముఠా.. ?
అభిషేక్ కుమార్ స్థానికంగా ఒకప్పుడు చిన్న టీ దుకాణం నడిపించేవాడు. అయితే తర్వాత దుబాయ్‌కి వెళ్లి అక్కడి నుంచి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నాడు. అతని సహకారంతో ఆదిత్య కుమార్ ఇక్కడ ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. సైబర్‌ నేరాలతో కొల్లగొట్టిన సొమ్మును బ్యాంక్‌ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి నగదును డ్రా చేసి వాడుకుంటున్నారు.

తనిఖీలలో పట్టుబడ్డ నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులను సీజ్‌ చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సైబర్‌ డీఎస్పీ అవంతిక దిలీప్‌ కుమార్‌ వెల్లడించారు. బెంగళూరులో జారీ అయిన పాస్‌బుక్స్ ఆధారంగా ఈ నెట్‌వర్క్.. కేవలం బీహార్‌కే పరిమితమై ఉండకపోవచ్చని, జాతీయ స్థాయిలో విస్తరించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, ఉగ్ర లింకుల నేపథ్యంలో.. ఇన్‌కమ్ టాక్స్, ఏటీఎస్(Anti-Terrorism Squad) బృందాలు రంగంలోకి దిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement